ChatGPT.. అమెరికన్ కంపెనీ OpenAI రూపొందించిన కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్‌బాట్. GPT (Generative Pre-trained Transformer) అనే లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది ఈ చాట్‌జీపీటీ. ఇది మనిషి లాగా మాట్లాడగల, వ్రాయగల, సమాధానాలు ఇవ్వగల కంప్యూటర్ ప్రోగ్రామ్. విద్యార్థులు, ఉద్యోగులు, క్రియేటర్లు, టెకీలు ఇలా అన్ని వర్గాలవారికి చాట్ జీపీటీ ఉపయోగపడుతుంది. ఇప్పటికే ChatGPT చాలా వెర్షన్లలో అందుబాటులో ఉంది.. అయితే ChatGPT Go వెర్షన్ ఇప్పుడు భారత్ లో ఉచితంగా లభిస్తోంది.. సంవత్సరం పాటు ఫ్రీ.. Open AI అందిస్తున్న ఈ ఆఫర్ ను ఎలా యాక్టివేట్ చేసుకోవా.. ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసుకుందాం..
భారత్ లో ChatGPT Go ఇవాళ్టి (నవంబర్4 ) నుంచి ఉచితంగా అందించబడుతోంది. ఈ ఆఫర్ కొత్త, పాత యూజర్లకు వర్తిస్తుంది. 12 నెలలపాటు ఏకధాటిగా యూజర్లు ఉచితంగా వాడుకోవచ్చు.
ChatGPT Go ఎందుకు ఉచితం?
భారత్ లో AI కి చాలా క్రేజ్ఉంది. OpenAI కి అభివృద్ది చెందుతున్న మార్కెట్లలో భారత్ ఒకటి. ఆగస్టులో ChatGPT Go ప్రారంభించిన నెలలో సబ్ స్క్రిప్షన్లు రెట్టింపు అయ్యాయి. AI ప్రత్యర్థులతో పోటీగా నిలబడేందుకు ఇదొక మార్గంగా భారత్ యూజర్లే లక్ష్యంగా OpenAIఈ ఆఫర్ ను అందిస్తోంది.
ఉచితంగా ChatGPT GO ఏమి అందిస్తుంది?
గతంలో నెలకు రూ. 399 ధరకే లభించే ChatGPT Go, ప్రీమియం ఫీచర్లను అందించేది. రోజువారీ మేసేజ్ లిమిట్స్ ఉండేవి. ఇప్పుడు అలా కాదు. మరిన్ని AI ఇమేజ్ జనరేషన్స్, విశ్లేషణ కోసం పెద్ద ఫైల్ అప్‌లోడ్‌లు చేసుకోవచ్చు. ఎక్కువ మెమరీ,OpenAI ఫ్లాగ్‌షిప్ GPT-5 మోడల్‌కు యాక్సెస్ ను అందిస్తుంది. ఈ ప్రమోషన్ తో ఈ ఫీచర్లన్నీ 1 సంవత్సరం పాటు ఉచితం. భారత్ లో ఇప్పటికే చెల్లింపు సబ్‌స్క్రైబర్లు కూడా ఆటోమేటిక్‌గా ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఉచిత ChatGPT Go ప్లాన్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి..?
- మొబైల్ యాప్‌లో లేదా వెబ్‌లో ChatGPT వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
 - మీ ఖాతాను (Gmail, Microsoft, మొదలైనవి) ఉపయోగించి సైన్ ఇన్ చేయాలి.
 - ChatGPT ప్రొఫైల్ చిహ్నంపై ప్రెస్ చేయాలి.
 - తరువాత అప్‌గ్రేడ్ యువర్ ప్లాన్ పై నొక్కండి లేదా సెట్టింగ్స్ కు వెళ్లి సబ్‌స్క్రిప్షన్ పై నొక్కాలి.
 - అక్కడ ChatGPT Go సెలెక్ట్ చేసుకోవాలి.
 - ఆ తరువాత స్క్రీన్ పై ఉన్న ఆప్షన్లు అనుసరించి ఫిల్ చేయాలి.
 - ఉచిత ChatGPT Go వెంటనే యూజర్ ఖాతాకు జోడించబడుతుంది.
 
OpenAI కి భారత్ ఎందుకు కీలకం?
OpenAI కి భారత్ రెండవ అతిపెద్ద మార్కెట్ అని చెబుతారు. కార్యాలయాలు, విద్య, స్టార్టప్‌లు ,సృజనాత్మక రంగాలలో AI వినియోగం పెరుగుతున్నందున, భారత్ AI కంపెనీలకు కీలకమైన పరీక్షా కేంద్రంగా ఉంది. AI ప్రత్యర్థులతో పోటీగా నిలబడేందుకు ఇదొక మార్గంగా భారత్ యూజర్లే లక్ష్యంగా OpenAIఈ ఆఫర్ ను అందిస్తోంది.
