నిజామాబాద్ జిల్లాలో ఓ కీచక డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి బాగోతం బయటపడింది. ఇద్దరు కలిసి తనను లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది ఓ మహిళ.
న్యూడ్ కాల్స్ చేయాలని.. గెస్ట్ హౌస్ కు రావాలంటూ రెండేళ్ల నుంచి టార్చర్ పెడుతున్నారని బిందు అనే బాధితురాలు సీపీకి ఫిర్యాదు చేసింది. జాబ్ మానేసినా తనను వదలడం లేదని..తన గోడు వెల్లబోసుకుంది బాధితురాలు. మహిళను వేధించిన డెంటల్ డాక్టర్, రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కేసు నమోదు చేయాలని సీపీ సాయి చైతన్య ఆదేశించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు.
బాధితురాలి బిందు ఫిర్యాదులో ఏముందంటే.. 2021లో నేను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ లో పనిచేశా. ఆ సమయంలో రెండు మూడు సార్లు డెంటల్ డాక్టర్ అమర్ అనే వ్యక్తి పాస్ పోర్ట్ కావాలని వచ్చాడు. అలా రెండు మూడు సార్లు వచ్చాడు. తర్వాత ఫోన్ చేసి వేదించడం మొదలు పెట్టాడు. తర్వాత నేను జాబ్ మానేసి..అతడి ఫోన్ నంబర్ ను బ్లాక్ లో పెట్టా.. బ్లాక్ లో పెడితే ఎందుకు పెట్టావని వచ్చి డాక్టర్ ప్రశ్నించాడు. న్యూడ్ కాల్స్ చేయాలని..గెస్ట్ హౌస్ కు వస్తే డబ్బులిస్తానని పదే పదే వేదిస్తున్నాడు.
మా ఆఫీస్ సార్ వాళ్ల బావ రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగాధర్ ..అతను కూడా పదే పదే ఆఫీస్ కు వచ్చినపుడు నా చెంపలు పిండేవాడు. మా సార్ లేని సమయంలో వచ్చి హోటల్ లో రూం బుక్ చేస్తా.. వెళ్దాం.. లడ్డులాగా ఉన్నావు..నా పెళ్లాం కూడా నీలా లేదని వేధించేవాడు. జాబ్ మానేసినా వేధింపులు ఆపడం లేదు.. ఇద్దరు కలిసి నాకు నరకం చూపిస్తున్నారు. టార్చర్ పెడుతున్నారు. నాకు రక్షణ కల్పించండి..అని సీపీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో స్పందించిన సీపీ..వాళ్లిద్దరిపై కేసు నమోదు చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ కు సిఫార్సు చేశారు.
