The RajaSaab: ప్రభాస్ రాజాసాబ్ సంక్రాంతి రిలీజ్ అవుతుందా? లేదా?.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

The RajaSaab: ప్రభాస్ రాజాసాబ్ సంక్రాంతి రిలీజ్ అవుతుందా? లేదా?.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో ముందొచ్చేది ‘ది రాజా సాబ్’ (The Raja Saab). మారుతి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఊరిస్తూ వస్తోంది. ప్రభాస్ కెరీర్లో ఫస్ట్ టైం హారర్ కామెడీ జానర్ సినిమా చేస్తుండటంతో హైప్ మరింత ఎక్కువగా ఉంది. కానీ, సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు.

అయితే, ఇపుడీ రాజాసాబ్ మరింత దూరం వెళ్లినట్లు టాక్ ఊపందుకుంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన రాజా సాబ్, డిసెంబర్ 5, 2025 నుంచి 2026 జనవరి 9 థియేటర్లలోకి వస్తుందని అలోమోస్ట్ కన్ఫామ్ అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే.

అయితే, గత వారం రోజులుగా సినిమా మరోసారి వాయిదా పడిందని.. జనవరి 9 నుంచి మార్చికి వెళ్లిందని రూమర్స్ బలంగా వినిపిస్తున్నాయి. సినిమా VFX, గ్రాఫిక్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడమే కారణమని, అందుకే వాయిదా అంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పూర్తిగా డిజప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న అన్నీ రూమర్స్కి చెక్ పెడుతూ.. రాజాసాబ్ ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇచ్చేసింది. అనుకున్న టైంకే, 2026 జనవరి9న రాజాసాబ్ థియేటర్లోకి వస్తుందంటూ మేకర్స్ ఖరాఖండిగా చెప్పేసారు. ఈ ఒక్క పోస్ట్తో అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి.

‘‘ప్రభాస్,మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో రూపొందుతున్న రాజా సాబ్’ వచ్చే సంక్రాంతికి జనవరి 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడిందంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారమవుతోంది. అవన్నీ రూమర్స్ మాత్రమే. అందులో ఎటువంటి నిజం లేదు. జనవరి 9న "రాజా సాబ్" సినిమా ఘనంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ప్రస్తుతం ‘‘రాజా సాబ్’’సినిమాకు సంబంధించిన VFX, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి. జనవరి 9న అన్ని భాషల్లో విడుదల చేసేందుకు రిలీజ్ సన్నాహాలు కూడా చేస్తున్నాం. IMAX వెర్షన్ సహా అన్ని లార్డర్ ఫార్మేట్స్లో "రాజా సాబ్" ప్రేక్షకుల ముందుకు రానుందని నోట్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. 

అంతేకాకుండా.. డిసెంబర్లో USA లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపనున్నారని తెలిపారు. ఈ క్రమంలో డిసెంబర్ 25 లోగా ఫస్ట్ కాపీ రెడీ చేసి, అన్ని హంగులతో సంక్రాంతి సందడి రెట్టింపు  చేసేందుకు ‘‘రాజా సాబ్’’ రెడీ అయిందని మేకర్స్ వెల్లడించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ నెక్స్ట్ వీక్లో రిలీజ్ కానుందని టాక్. ఇప్పటికే, ఫస్ట్ సింగిల్కి సంబంధించి ప్రభాస్ క్రేజీ లుక్ సైతం రిలీజ్ చేశారు. మరో రెండ్రోజుల్లో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. 

ఇకపోతే, ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్  కీల‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌ పాత్రలో కనిపించనున్నారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నివహిస్తున్నారు. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ చేస్తుండగా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.