ఆపిల్ ఐఫోన్ 16 అత్యంత ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ లో ఒకటి. అయితే ఈ నవంబర్‌లో జరగబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ డేస్ సేల్ సమయంలో ఈ ఐఫోన్ మళ్లీ డిస్కౌంట్ ధరతో వస్తుంది. ఇంతకుముందు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 51,999తో అతితక్కువ ధరకే లభించింది. ఇప్పుడు కూడా మీరు ఈ ఐఫోన్ 16ని సొంతం చేసుకోవాలంటే బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ బోనస్ ఉపయోగించుకుంటే ఈ ఫోన్‌ను రూ.58 వేల కంటే ఇంకా తక్కువ ధరకు కొనే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం, ఐఫోన్ 16 ఫ్లిప్‌కార్ట్ ధర రూ.62,999కి, ఐఫోన్ 17 లాంచ్ తర్వాత ఆపిల్ తగ్గించిన ధర రూ.69,900 కంటే చాల తక్కువ. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 ధర ఆఫర్స్ చూస్తే దీని బేస్ ధర రూ. 62,999. బ్యాంక్ ఆఫర్ కింద రూ. 3 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు, అది కూడా సెలెక్ట్ చేసిన క్రెడిట్ కార్డులపై రీడీమ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ఛేంజ్ బోనస్ ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది.
కొన్ని బ్యాంక్ కార్డులకు EMI అప్షన్స్ కూడా ఉంది, వీటిని ఫ్లిప్‌కార్ట్‌లో పొందవచ్చు. ఇవన్నీ కలుపుకొని ఫైనల్ ధర రూ. 58 వేల కంటే తక్కువే ఉంటుంది.
ఐఫోన్ 16 HDR10 సపోర్ట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది, అవుట్‌డోర్‌లో 1,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది, అలాగే 60 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ఫోన్ సిరామిక్ షీల్డ్, ఒలియోఫోబిక్ ఫినిషింగ్ తో వస్తుంది. 3nm ప్రాసెస్‌పై నిర్మించిన Apple A18 చిప్ ద్వారా ఈ ఫోన్ రన్ అవుతుంది. 6-కోర్ CPU, 8 జీబీ ర్యామ్, 128GB / 256GB స్టోరేజ్ అప్షన్ ఉంది.
ఐఫోన్ 16లో 48MP ప్రైమరీ షూటర్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్, 2x అండ్ 5x ఆప్టికల్ జూమ్‌తో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా, ముందు భాగంలో 12MP ట్రూడెప్త్ ఫ్రంట్ షూటర్ కెమెరా ఉంది. ఐఫోన్ 17 విడుదలైనప్పటి నుండి ఐఫోన్ 16 ఒక గొప్ప వాల్యూ అప్షన్ గా నిలిచింది. లేటెస్ట్ డిజైన్, మంచి డిస్ ప్లే, సూపర్ బ్యాటరీ బ్యాకప్, ప్రీమియం కెమెరా క్వాలిటీ ఇవన్నీ రూ.60వేలలోపు ఐఫోన్ కోసం చూస్తున్న వారికి ఇదొక మంచి అప్షన్.
