వారంలో రెండోసారి..శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు, భారీ వృక్షాలు

వారంలో రెండోసారి..శ్రీశైలం ఘాట్ రోడ్డులో  విరిగిపడ్డ కొండచరియలు, భారీ వృక్షాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగలో భక్తులకు  పెను ప్రమాదం తప్పింది.  శ్రీశైలం పాతాళగంగ రోప్ వే దగ్గర  కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం కారణంగా కొండ చరియలు, భారీ వృక్షాలు రోడ్డుపై విరిగిపడ్డాయి.  భక్తులకు పెను ప్రమాదం తప్పడంతో   రోప్ వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కొండ చరియలు విరిగిపడడం  వారంలో రెండవ సారి.

మొంథా తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 29న శ్రీశైలం రోప్ వే దగ్గరలోని పాతాళగంగ మెట్ల మార్గం దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో షాపులు ధ్వంసం అయ్యాయి. రాత్రి సమయంలో కొండచరియలు విరిగిపడటంతో భక్తులు లేనందున ప్రమాదం తప్పింది.  తరచూ కొండ చరియలు విరిగిపడటంతో స్థానికులు, భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేదంటే..భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.