నల్లగొండ పట్టణంలో కార్డెన్ సెర్చ్

నల్లగొండ పట్టణంలో కార్డెన్ సెర్చ్

నల్గొండ, వెలుగు: నల్లగొండ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో నల్లగొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేసి ఈ తనిఖీలు చేపట్టారు. డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో 200 మంది పోలీసు సిబ్బంది 10 బృందాలుగా విడిపోయి సతీశ్​నగర్ సహా పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలను జల్లెడ పట్టారు.

సుమారు 360 ఇండ్లలో నిర్వహించిన సోదాల్లో 46 మంది అనుమానితులను గుర్తించారు. ఇద్దరు గంజాయి సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. అక్రమంగా నిల్వ ఉంచిన 16 గుట్కా బ్యాగులు, సరైన పత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 4 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.