న్యూఢిల్లీ: రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు విద్యుత్ వంటి రంగాల పేలవమైన పనితీరు కారణంగా ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి జనవరిలో 15 నెలల కనిష్ట స్థాయి 3.6 శాతానికి పడిపోయింది.
బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్ విద్యుత్ వంటి ఎనిమిది ప్రధాన రంగాల వృద్ధి డిసెంబర్‌లో 4.9 శాతంగా ఉంది. 2023 జనవరిలో ఇది 9.7 శాతంగా ఉంది. అక్టోబరు 2022లో వృద్ధి రేటు 0.9 శాతంగా నమోదైంది. మొత్తంగా, ఈ రంగాల ఉత్పత్తి వృద్ధి రేటు ఏప్రిల్–జనవరి 2022–-23లో 8.3 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింది.
