కరోనా వైరస్ వచ్చిన సెలబ్రిటీలు వీరే..!

కరోనా వైరస్ వచ్చిన సెలబ్రిటీలు వీరే..!

కరోనా వైరస్​ ప్రపంచాన్ని వణికిస్తోంది.  ఈ వైరస్ వీవీఐపీలను కూడా వదలడం లేదు. మంత్రులు, సిన్మా రంగ ప్రముఖులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు ఒకరనేమిటి అన్ని రంగాలకు చెందిన  సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు.

యూరప్​లోని ప్రజలు ముందు జాగ్రత్తగా సరుకులు కొనేసి దాచుకుంటున్నారు. మాల్​లో ఓ జంట ఇలా అవసరానికి మించి  కొంటోంది.

కరోనా వైరస్ విస్తరించడం మొదలుకాగానే హాలీవుడ్ వెంటనే అలర్టయింది. అనేక షూటింగ్​లను ప్రొడక్షన్ కంపెనీలు వాయిదా వేసుకున్నాయి. అంతేకాదు, సిన్మాల విడుదలను కూడా  నిర్మాతలు పోస్ట్ పోన్ చేసుకున్నారు.

టామ్ హాంక్స్, ఆయన భార్యకు..
హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ ఆయన భార్య, నటి రీటా విల్సన్ లేటెస్ట్​గా ఈ మహమ్మారి బారిన పడ్డా రు. 63 ఏళ్ల ఈ హాలీవుడ్ హీరో ఆస్ట్రేలియా లో ఒక సిన్మా షూటింగ్ లో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బం ది పడ్డా డు. అంతకుముందు కొన్ని రోజులుగా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. టామ్ తో పాటు రీటా కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని టామ్ హాంక్స్ స్వయంగా ఇన్ స్టాగ్రా మ్ ద్వారా వెల్లడించాడు. వీళ్లిద్దరూ ప్రస్తుతం ఆస్ట్రేలియా లోని గోల్డ్ కోస్ట్ ఆస్పత్రిలోని ఓ ఐసోలేషన్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ‘మీరు కూడా జాగ్రత్తగా ఉండండి’ అంటూ అభిమానులనుద్దేశించి టామ్ హాంక్స్ ట్వీట్ చేశాడు.

ఎవరెవరు కలిశారు?
సిన్మా షూటింగ్ సందర్భంగా టామ్ చాలా మందితో కలిసి ఫొటోలు దిగారు. ఫ్యాన్స్​ చాలామంది షూటింగ్ స్పాట్ కు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడారు. వారి అడ్రసులు కనుక్కుని వారికి కరోనా టెస్టులు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

సెట్ కు రానివ్వడం లేదు
సిన్మా షూటింగ్ సందర్భంగా ప్రొడక్షన్ డిపార్టుమెంట్ లో ఒకరి దగ్గర కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో షూటింగ్ జరిపిన సిన్మా సెట్ దరిదాపులకు ఎవరూ వెళ్లవద్దని డాక్టర్లు, హెల్త్ డిపార్ట్ మెంట్ అఫీషియల్స్ ఆదేశించారు.

బాస్కెట్ బాల్ క్రీడాకారుడు రూడీ గోబర్ట్​కు…

అమెరికాలోని ప్రముఖ బాస్కెట్​ బాల్ క్రీడాకారుడు రూడీ గోబర్ట్​కు తాజాగా కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో ‘నేషనల్ బాస్కెట్​బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)’ అప్రమత్తమైంది. బాస్కెట్​బాల్ లీగ్ పోటీలను  క్యాన్సిల్ చేసింది. రూడీ గత 15 రోజుల్లో ఆరు పెద్ద టీంలతో కలిసి బాస్కెట్​బాల్​ ఆడాడు.

హెల్త్ మినిస్టర్​కే వైరస్

బ్రిటన్​లో ఏకంగా హెల్త్ మినిస్టర్ నదీన్ డోరిస్​కి ఈ వైరస్​ సోకింది. దీంతో ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంటూ ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బ్రిటన్​లో కరోనా పాజిటివ్​గా నిర్థారణయిన తొలి పొలిటీషియన్ నదీన్ డోరిస్.  కేబినెట్ మినిస్టర్ కావడంతో డోరిస్ చాలామందితో టచ్​లో ఉండటం సహజం. వీరిలో ఎంతోమంది పై స్థాయి అధికారులు, ఇతర మంత్రులు ఉంటారు. వీరిలో ఎవరికైనా కరోనా సోకిందా అనే అనుమానాలు వస్తున్నాయి. టెస్టులు చేయడానికి ప్రత్యేక టీంలు రెడీ అయ్యాయి.

బ్రిటన్ ప్రధానికి టెస్టులు అక్కర్లేదు

ప్రధాని బోరిస్ జాన్సన్​తో కలిసి ఒక ప్రోగ్రాంకు అటెండ్ అయిన తరువాత నదీన్ డోరిస్ దగ్గర కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో  ప్రధాని బోరిస్ జాన్సన్​కు కూడా టెస్టు లు చేస్తారా అనే ప్రశ్న ఒక దశలో తెరమీదకు వచ్చింది. అయితే అలాంటిదేమీ లేదని బ్రిటన్ అధికార వర్గాలు తెలిపాయి. బోరిస్ దగ్గర కరోనా లక్షణాలు ఏమీ లేవని హెల్త్ మినిస్ట్రీ వర్గాలు  పేర్కొన్నాయి.

బ్రిటన్ ఎంపీ రాచెల్ ముందు జాగ్రత్త

హెల్త్ మినిస్టర్ నదీన్ డోరిస్​కి కరోనా సోకిందని తేలగానే లేబర్ పార్టీ ఎంపీ రాచెల్ మాస్కెల్ భయపడిపోయారు. ఎందుకంటే,  అంతకుముందే డోరిస్​తో రాచెల్​ సమావేశమయ్యారు. దీంతో ముందు జాగ్రత్తకోసం రాచెల్​  ఐసోలేషన్ వార్డులో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ‘హెల్త్ డిపార్ట్​మెంట్ అధికారులు ఇచ్చిన సలహాలను మనందరం పాటించాలి’ అంటూ ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు.

ఫ్రాన్స్, స్పెయిన్​ మినిస్టర్లకు కరోనా

ఫ్రాన్స్ కల్చరల్ మినిస్టర్  ఫ్రాంక్ రీస్టెర్​కు పాజిటివ్​గా రిజల్ట్ రావడంతో ఆయన ఇల్లు కదలడం లేదు.  ఇంట్లోనే ఐసోలేషన్​లో ఉంటున్నారు. ఫ్రాంక్ రీస్టెర్​కు వైరస్ ఎప్పుడు, ఎలా సోకిందనేది తేల్చడంలో ఫ్రాన్స్ డాక్టర్లు ఎంక్వయిరీ మొదలెట్టారు. స్పెయిన్​ సెకండ్​ డిప్యూటీ ప్రైమ్​ మినిస్టర్​ పాబ్లో ఈగ్లేసియాస్​కి, అతని భార్య ఈక్వాలిటీ మినిస్టర్​ ఐరీన్​ మాంటెరోలకు కరోనా టెస్ట్​లు జరిగాయి. పాబ్లోకి నెగెటివ్​ రాగా, ఐరీన్​కు పాజిటివ్​ వచ్చింది. దాంతో భార్యభర్తలిద్దరినీ ఐసోలేషన్​ వార్డులో చేర్చారు.

ఇరాన్​లో 23 మందికి పైగా లీడర్లకు…

ఇరాన్ విషయానికొస్తే ఇక్కడ 23 మందికి పైగా పొలిటీషియన్లకు కరోనా సోకినట్లు తేల్చి చెప్పాయి. వీరిలో పరిశ్రమల శాఖ మంత్రి రెజా రహ్మానీ ఉన్నారు.