ఏపీలో ఇవాళ కరోనా కేసులు 12,615.. ఐదుగురి మృతి

ఏపీలో ఇవాళ కరోనా కేసులు 12,615.. ఐదుగురి మృతి

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న 10వేలు దాటగా.. ఇవాళ ఏకంగా 12 వేల 615 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య.. పరిస్థితులు చూస్తుంటే రానున్న రోజుల్లో కేసులు మరింత భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లాలో గడచిన 24 గంటల్లో  47 వేల 420 మందికి పరీక్షలు చేయగా.. 12,615 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 53 వేల 871 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 
గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా అనారోగ్యంపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు చనిపోయారు. విశాఖపట్టణం జిల్లాలో ముగ్గురు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,338, విశాఖ జిల్లాలో 2,117 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాల్లో 363 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలు కింద పట్టికలో చూడండి.

 

 

ఇవి కూడా చదవండి


సమాజాన్ని ఎదిరించి.. ఫైన్ కట్టి కూతురిని చదివించింది

ఎమ్మెల్యేను తరిమికొట్టిన గ్రామస్థులు

డిటర్జెంట్ పేరుతో లక్షల్లో నగదు తరలింపు