రాష్ట్రంలో 500 దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో 500 దాటిన కరోనా కేసులు

మరో 16 మందికి కరోనా
నిన్న మరో ఇద్దరు మృతి
శనివారం మరో 51 మంది హాస్పిటల్నుంచి డిశ్చార్జి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో శనివారం మరో 16 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు హెల్త్ డిపార్టమెంట్ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 503కు చేరింది. ఇందులో ఇప్పటికే 45 మంది కోలుకోగా.. శనివారం మరో 51 మందిని డిశ్చార్జి చేశారు. మిగతా 393 మంది వివిధ దవాఖానాల్లో చికిత్స పొందుతున్నారు. శనివారం కొత్తగా నల్గొండ జిల్లాలో 3, ఆసిఫాబాద్‌ 2, ఖమ్మం 2, నిర్మల్‌‌ 2, నిజామాబాద్‌ 2, మెదక్‌,
రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

మరో ఇద్దరు మృతి
రాష్ట్రంలో కరోనాతో ఇంకో ఇద్దరు చనిపోయారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్దుడు గాంధీ హాస్పిటల్‌‌లో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. మర్కజ్‌ కు వెళ్లొచ్చిన వ్యక్తి ద్వారా ఆయనకు వైరస్ సోకినట్టు అధికారులు తెలిపారు. ఇక యశోదా హాస్పిటల్‌ ‌నుంచి గాంధీకి తరలిస్తుండగా అంబులెన్స్‌‌లోనే ఓ మహిళ మరణించింది. ఈ రెండింటితో కలిపి రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14కు చేరింది.

For More News..

లాక్ డౌన్ ఎత్తేయాలంటే ఈ ఆరు ఖచ్చితంగా చేయాలి..