చైనా జెజియాంగ్ ప్రావిన్స్​లో కరోనా కేసులు

చైనా జెజియాంగ్ ప్రావిన్స్​లో కరోనా కేసులు


బీజింగ్: చైనాలో కరోనా కల్లోలం మరింత తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా అనేక ప్రావిన్స్ లలో లక్షల కొద్దీ డైలీ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఝెజియాంగ్ ప్రావిన్స్ లోనే రోజూ దాదాపు 10 లక్షల కరోనా కేసులు రికార్డ్ అవుతున్నాయని ఆదివారం లోకల్ గవర్నమెంట్ ప్రకటించింది. ప్రావిన్స్ లో సుమారు 6.54 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ రానున్న రోజుల్లో డైలీ కేసులు డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. దేశంలో అసింప్టమాటిక్ కేసులనూ లెక్కిస్తున్న కొన్ని ప్రావిన్స్ లలో జెజియాంగ్ కూడా ఒకటి. ఈ వేవ్​లో మిగతా ప్రావిన్స్​ల కంటే జెజియాంగ్ లో ముందే కరోనా పీక్ స్టేజీకి వచ్చిందని అంచనా వేస్తున్నారు. మరోవైపు వచ్చే నెల 22న చైనీస్ న్యూ ఇయర్ వేడుకలు జరగనున్నాయి. ఏటా న్యూఇయర్ సందర్భంగా నెల రోజుల పాటు కోట్లాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా ప్రయాణాలు పెట్టుకుంటుంటారు. దీంతో వచ్చే నెలలో ఇక్కడ డైలీ కేసులు 20 లక్షలకు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం జెజియాంగ్ ప్రావిన్స్​లోని ప్రైవేట్ హాస్పిటల్స్​లో 13,583 మంది కరోనా ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు. 242 మంది పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు.  

రానున్నవి డేంజర్ వీక్స్ 

కరోనా విపత్తు మొదలైనప్పటి నుంచీ చైనాకు రానున్న కొన్ని వారాలు అత్యంత ప్రమాదకరం కానున్నాయని బ్రిటన్​కు చెందిన క్యాపిటల్ ఎకనామిక్స్ అనే రీసెర్చ్ సంస్థ హెచ్చరించింది. ‘‘చైనీస్ న్యూ ఇయర్ వస్తుండటంతో దేశవ్యాప్తంగా జర్నీలు మొదలవుతాయి. దీంతో దేశంలో కరోనా ఎఫెక్ట్ లేని ప్రాంతాలూ రిస్క్ లో పడతాయి” అని ఆ సంస్థ వివరించింది.

లెక్కలపై గందరగోళం 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నా.. శనివారం వరకూ గత 5 రోజుల్లో కరోనాతో ఎవరూ చనిపోలేదని చైనీస్ సీడీసీ ఆదివారం తెలిపింది. కరోనా బారిన పడిన వాళ్లు.. శ్వాస సమస్యతో చనిపోతేనే కరోనా డెత్ గా లెక్కిస్తున్నారు. జీరో కొవిడ్ పాలసీని రద్దు చేశాక చైనా ప్రభుత్వం అధికారికంగా డబ్ల్యూహెచ్ వోకు లెక్కలు చెప్పడం లేదు. 

సిక్ అయినా డాక్టర్లకు డ్యూటీలు 

చైనాలో కరోనా కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా డాక్టర్లు సిక్ అయినా కూడా డ్యూటీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో రిటైర్ అయిన డాక్టర్లు, హెల్త్ స్టాఫ్ సేవలను వినియోగించుకుంటున్నారని చైనీస్ మీడియా వెల్లడించింది. ఒక్క జెజియాంగ్ లోని క్లినిక్ లకే రోజూ 4 లక్షల మంది వస్తున్నారని, వారం రోజుల కిందటితో పోలిస్తే ఇది 14 రెట్లు ఎక్కువని అధికారులు వెల్లడించారు. ఈ ప్రావిన్స్ క్యాపిటల్ హాంగ్ ఝౌలో ఉన్న ఎమర్జెన్సీ సెంటర్ కు పేషెంట్ల తాకిడి 3 రెట్లు పెరిగిందన్నారు. 

25 కోట్ల మందికి కరోనా

చైనాలో డిసెంబర్ 1 నుంచి 20 వరకే దాదాపు 25 కోట్ల మంది కరోనా బారిన పడ్డారని నేషనల్ హెల్త్ కమిషన్ నుంచి లీక్ అయిన ఓ డాక్యుమెంట్ ద్వారా వెల్లడైంది. ఇది దేశ జనాభాలో దాదాపుగా 17.56 శాతం అని హాంకాంగ్ కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. షాండాంగ్ ప్రావిన్స్ లోని క్వింగ్ డావోలో రోజూ 5 లక్షలు, గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని డాంగ్ గ్వాన్ సిటీలో రోజూ 3 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. గత మంగళవారం నాటికే దేశంలో 3.70 కోట్ల మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది. దవాఖాన్లపై విపరీతమైన ఒత్తిడి పడటంతో ప్రభుత్వం ‘ఇంటర్నెట్ హాస్పిటల్స్’ ఓపెన్ చేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చినట్లు ఆ పత్రిక వెల్లడించింది.

ఐడియా అదుర్స్.. ఆగుతదా వైరస్?

చైనాలో ఇద్దరు భార్యాభర్తలు ఇట్లా ఛత్రికి పైనుంచి కిందిదాకా ప్లాస్టిక్ కవర్ ను ఏర్పాటు చేసుకుని అందులో మార్కెట్​కు వచ్చారు. ఒకరు ఛత్రి పట్టుకుంటే.. మరొకరు కూరగాయలు, కావాల్సిన సరుకులు కొనుక్కున్నారు. జనం కూడా ఇందులో సర్ ప్రైజ్ ఏముందన్నట్లుగా ఎవరి బిజీలో వాళ్లున్నారు. వెరైటీగా ఉన్న ఈ ఛత్రి ఐడియా మాత్రం వైరల్ అవుతోందంటూ ‘పీపుల్స్ డైలీ’ ఈ వీడియోను పోస్ట్ చేసింది. అయితే, కూరగాయలు, సరుకుల ద్వారా వైరస్ అంటుకుంటే ఏం చేస్తారు? అంటూ నెటిజన్ లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.