ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

V6 Velugu Posted on Jun 09, 2021

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న(మంగళవారం) తగ్గినట్టు కనిపించిన కరోనా కేసులు ఇవాళ(బుధవారం) మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,766 కేసులు నిర్ధారణయ్యాయి. 67 మంది చనిపోయారు. ప్రస్తుత కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం 17,79,773 మంది వైరస్ బారినపడ్డారు. మరణాల సంఖ్య 11,696కు చేరుకుంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 93,511 మందికి పరీక్షలు నిర్వహించారు. 12,292 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో వైరస్ బారి నుంచి ఏపీ వ్యాప్తంగా బయటపడిన వారి సంఖ్య 16,64,082కు చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 1,03,995 యాక్టివ్ కేసులున్నాయి. లేటెస్టుగా  నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,980 కేసులు ఉండగా , విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 265 కేసులు నమోదయ్యాయి.

Tagged corona cases, Andhra Pradesh, rise aga

Latest Videos

Subscribe Now

More News