పెండ్లి మండపాలపై ‘కరోనా’ కేసులు

పెండ్లి మండపాలపై ‘కరోనా’ కేసులు

వాటిని బుక్​ చేసిన వారిపై కూడా..
నిబంధనలు ఉల్లంఘించినందుకే 

నిర్మల్‍, వెలుగు: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు పెండ్లి మండపాలపై కేసులు నమోదయ్యాయి. వాటిని బుక్​ చేసిన వారిపై కూడా కేసులు నమోదయ్యాయి. పెండ్లి సందర్భంగా మ్యారేజ్​ హాల్​లో 200 మందికి మించి ఉండొద్దని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ.. నిర్మల్​ జిల్లాలో శుక్రవారం జరిగిన వేర్వేరు పెండ్లి వేడుకల్లో ఆ నిబంధనలను పాటించలేదు. 200 మందికిపైగా జనం పెండ్లికి రావడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. నిర్మల్​ పట్టణంలోని సాగర్​ కన్వెన్షన్, రాజరాజేశ్వర్ ఫంక్షన్‍ హాల్‍, ఆర్‍ఆర్‍  గార్డెన్‍,  ఖానాపూర్​లోని ఏఎంకే ఫంక్షన్‍ హాల్​ యజమానులపై, ఆయా మండపాలను బుక్​ చేసిన పెండ్లికొడుకు, పెండ్లికూతురు తరఫు వారిపై కేసులు నమోదు చేసినట్లు  సీఐ జాన్‍ దివాకర్​ తెలిపారు.