పరిహారం చెల్లింపులో లేట్ చేయొద్దు

పరిహారం చెల్లింపులో లేట్ చేయొద్దు

న్యూఢిల్లీ: సమయాన్ని వృథా చేయకుండా కరోనాతో చనిపోయినవాళ్ల కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను, యూటీలను సుప్రీం కోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లింపులో ఏమాత్రం లేట్ చేయొద్దని జస్టిస్ ఎమ్​ఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న బెంచ్ సోమవారం సూచించింది. పరిహారం కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం తిరస్కరించినట్లయితే బాధితులు ఫిర్యాదుల పరిష్కార కమిటీని ఆశ్రయించవచ్చని చెప్పింది. వచ్చిన ఫిర్యాదులను 4 వారాల్లోగా పరిష్కరించాలని ఫిర్యాదుల కమిటీని కూడా కోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ సర్కారు కరోనా విపత్తు నిధులను ఇతర ఖాతాల్లోకి బదిలీ చేసిందంటూ దాఖలైన పిటిషన్​పై తీర్పునిచ్చిన బెంచ్.. ఆ నిధుల ను రెండ్రోజుల్లో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్  ఖాతాల్లోకి ట్రాన్స్​ఫర్ చేయాలని ఏపీ సర్కారును ఆదేశించింది.