మార్కెట్​లోకి కరోనా నకిలీ వ్యాక్సిన్లు 

మార్కెట్​లోకి కరోనా నకిలీ వ్యాక్సిన్లు 
  • ప్రత్యేకమైన మెషీన్లతో కొవిషీల్డ్​ లేబుల్​ ప్రింట్​
  • కొవాగ్జిన్​ లేబుల్​పై యూవీ లైట్​తో కనిపించే డీఎన్​ఏ గుర్తు
  • స్పుత్నిక్​వీ డబ్బాపైనే ఇంగ్లిష్​.. యాంపుల్​పై రష్యా భాష

మార్కెట్​లోకి కరోనా నకిలీ వ్యాక్సిన్లు వస్తున్నాయి. కొవిషీల్డ్​ పేరుతో కొందరు కేటుగాళ్లు నకిలీ టీకాలను మార్కెట్​లోకి వదులుతున్నారు. కొన్ని రోజుల కిందట ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) దీనిపై వార్నింగ్​ కూడా ఇచ్చింది. ఆఫ్రికాలో నకిలీ వ్యాక్సిన్లను అంటగడుతున్నారని, ఇండియాలోనూ నకిలీ టీకాలున్నాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ఆ నకిలీ టీకాలపై రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్​ చేసింది. వాటిని గుర్తించేందుకు వీలుగా ఆదివారం పలు సూచనలను చేసింది. సీరమ్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్​, భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​, డాక్టర్​ రెడ్డీస్​ తయారు చేస్తున్న స్పుత్నిక్​ వీలను గుర్తించే టెక్నిక్​లను వివరించింది. 
ఫేక్​ వ్యాక్సిన్లతో పైలం
రష్యా నుంచి దిగుమతి అయ్యే స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్లను దేశంలో రెండు చోట్ల తయారు చేస్తున్నారు. కాబట్టి వాటికి రెండు వేర్వేరు లోగోలుంటాయి. వ్యాక్సిన్​ సమాచారం, డిజైన్​ అంతా సేమ్​ అయినా తయారుచేసే కంపెనీ పేరే వేరుగా ఉంటుంది. 
కేవలం వ్యాక్సిన్​ యాంపుల్స్​ను ప్యాక్​ చేసే డబ్బా ముందు, వెనుక భాగాల్లోనే ఇంగ్లిష్​లో సమాచారం ఉంటుంది. యాంపుల్​పై వ్యాక్సిన్​ బ్రాండ్​ పేరుతో పాటు డబ్బా మిగతా వైపులా అంతా రష్యా భాషలోనే సమాచారం ఉంటుంది.
సీరమ్​ సంస్థ లోగో ‘ఎస్​ఐఐ’..
    టీకా బుడ్డిపై ఉండే లేబుల్​ రంగు ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. బుడ్డి అల్యూమినియం సీల్​కు పైన ఉండే మూత కూడా ముదురు ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. 
    ట్రేడ్​మార్క్​తో వ్యాక్సిన్​ బ్రాండ్​ పేరు ఉంటుంది. 
    వ్యాక్సిన్​లో ఉండే కాంపోజిషన్​ పేరును బోల్డ్​ చేయరు.
    కాంపోజిషన్​ పేరు తర్వాత బ్రాకెట్​లో ‘రీకాంబినెంట్​’ ఉంటుంది. 
    లేబుల్​పై సీజీఎస్​ నాట్​ ఫర్​ సేల్​ అనే ముద్ర ఉంటుంది.
     లేబుల్​ అతికించేవైపు కూడా యూనిక్​గా ఎస్​ఐఐ లోగోను ప్రింట్​ చేశారు. ప్రత్యేకమైన కోణం, పొజిషన్​తో ఆ లోగో ఉంటుంది. 
    అక్షరాలు స్పష్టంగా కనిపించేలా ఫాంట్​ ఉంటుంది. ఆకుపచ్చ రంగు లేబుల్​పై తెలుపు రంగు అక్షరాలను ప్రింట్​ చేశారు. 
    లేబుల్​కు ప్రత్యేకమైన హనీకూంబ్​ ఎఫెక్ట్​ను ఇచ్చారు. అది ప్రత్యేకమైన యాంగిల్​లో మాత్రమే కనిపిస్తుంది. 
    లేబుల్​పై కొన్నిచోట్ల హనీకూంబ్​ ఎఫెక్ట్స్​​లో కొద్దిగా మార్పులుంటాయి. 

ఒరిజినల్​ కొవాగ్జిన్​ గుర్తించేది ఇట్ల..

    కొవాగ్జిన్​ టీకా లేబుల్​లో కంటికి కనిపించని డీఎన్​ఏ హీలిక్స్​ నిర్మాణం ఉంటుంది. అది కేవలం యూవీ లైట్​తోనే కనిపిస్తుంది. 
    లేబుల్​లో కంటికి కనిపించకుండా కొన్ని చుక్కలుంటాయి. ఆ చుక్కలను కొవాగ్జిన్​ అని వచ్చేలా పెట్టారు. 
    బ్రాండ్​ పేరులో ‘ఎక్స్​’లో సగాన్ని ఆకుపచ్చ రంగు ఎఫెక్ట్స్​​ ఇచ్చారు. 
    బ్రాండ్​ పేరుకు ప్రత్యేకమైన హోలోగ్రాఫిక్​ ఎఫెక్ట్స్​​ ఉంటాయి.