కరకగూడెం, వెలుగు : కొత్త సర్పంచులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం కరకగూడెం మండల కేంద్రంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజాస్వామ్య పరిరక్షణకు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, టీపీసీసీ మెంబర్ చందా సంతోష్, టీడీపీ మండల అధ్యక్షుడు సిరి శెట్టి కమలాకర్, మండల కాంగ్రెస్ నాయకులు ఎర్ర సురేశ్, తోలెం నాగేశ్వరరావు, పోలేబోయిన తిరుపతయ్య, కునుసోత్ సాగర్, ముంజాల సాయిబాబా, జలగం క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
