కరోనా డెత్ రేటు మన దగ్గరే తక్కువ

కరోనా డెత్ రేటు మన దగ్గరే తక్కువ

రికవరీ రేటు కూడా బాగుంది

లాక్‌డౌన్ అమలు, సకాలంలో ట్రీట్‌మెంట్ వల్లే

వెల్లడించిన హెల్త్‌మినిస్ట్రీ

క్లోజ్ కాంటాక్ట్స్‌తోనే వ్యాప్తి: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: కరోనా డెత్ రేటు ప్రపంచదేశాలతో పోలిస్తే మన  దగ్గరే తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా యావరేజ్​న  లక్షమందిలో 4.4 శాతం మరణాల రేటు ఉంటే మన దగ్గర మాత్రం అది 0.3 శాతంగా ఉందని లేటెస్ట్ లెక్కలను సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు.  లాక్ డౌన్ పెట్టడం,  కరోనా పేషెంట్లకు సరైన సమయంలో ట్రీట్ మెంట్  ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. మరణాల రేటు లో బెల్జియం 81.2 శాతంతో టాప్ ప్లేస్ లో ఉంది. వరల్డ్ ఏవరేజ్ తో పోల్చితో  మనదేశంలో  డెత్‌ రేటు చాలా తక్కువగా ఉండటం సంతోషించాల్సిన విషయమన్నారు. దేశంలో నమోదైన కరోనా కేసుల్లో మొన్నటి వరకు 3.3 శాతంగా మరణాల రేటు ఉంటే అది లేటెస్ట్ గా 2.87 శాతానికి తగ్గింది. ఈ గ్రాఫ్ ను మీడియా సమావేశంలో లవ్ అగర్వాల్ వివరించారు. రికవరీ రేటు కూడా సంతృప్తికరంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 60 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారని రికవరీ రేటు 41.61 గా శాతంగా ఉందన్నారు. చాలా దేశాలతో పోల్చితే మనం ఎంతో నయమని అన్నారు.

టెస్టింగ్​ కెపాసిటీ పెరిగింది

కరోనా వ్యాప్తి క్లోజ్ కాంటాక్ట్స్ లలోనే ఎక్కువ ఉంటుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. కరోనా సోకిన వ్యక్తుల్లో చాలా వరకు వాళ్లు ఎవరితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్నారో వాళ్లలో వ్యాప్తి వేగంగా ఉంటుందన్నారు.ఫిజికల్​ డిస్టెన్స్, వ్యక్తిగత పరిశుభ్రత ద్వారానే దీన్ని నివారించవచ్చన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా టెస్టింగ్ కెపాసిటీ పెరిగిందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతం 612 ల్యాబ్ లలో రోజుకు 1.10 లక్షల కరోనా టెస్ట్ లు జరుపుతున్నట్లు ప్రకటించింది.

భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌తో కలిసి వ్యాక్సిన్‌‌‌‌ రెడీ చేస్తున్న ఐసీఎంఆర్‌‌‌‌

వ్యాక్సిన్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ను మరో 6 నెలల్లో స్టార్ట్‌‌‌‌ చేస్తామని ఐసీఎంఆర్‌‌‌‌ వెల్లడించింది. భారత్‌‌‌‌ బయోటెక్‌‌‌‌తో కలిసి ఈ వ్యాక్సిన్‌‌‌‌ను రెడీ చేస్తోంది. పుణేలోని నేషనల్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ వైరాలజీలో ఐసోలేట్‌‌‌‌ చేసిన వైరస్‌‌‌‌ స్ట్రెయిన్‌‌‌‌ను వ్యాక్సిన్‌‌‌‌కు వాడనున్నారు. ఈ ఐసోలేటెడ్‌‌‌‌ కరోనా వైరస్‌‌‌‌ శరీరంలోకి చేరగానే అందుకు తగ్గట్టు యాంటీబాడీలు డెవలప్‌‌‌‌ అవుతాయి.

For More News..

ఉద్ధవ్ సర్కార్‌ను కూలదోయం

50 ఏండ్ల తర్వాత కనిపించిన అరుదైన అడవి కుక్క