కరోనా మరణాలు మన దగ్గరే తక్కువ

కరోనా మరణాలు మన దగ్గరే తక్కువ
  • రికవరీ రేటులోనూ ఫస్ట్ ప్లేస్
  • సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత తక్కువగా కరోనా డెత్ రేటు ఇండియాలోనే నమోదైందని సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ ఆదివారం వెల్లడించింది. ఇండియాలో కరోనా మరణాల రేటు ప్రస్తుతం 1.43 గా ఉందని చెప్పింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఇండియా ఫస్ట్ ప్లేస్ లో ఉందని, రికవరీల రేటు 97.31 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,194 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,09,04,940 కు పెరిగింది. ఇందులో ఇప్పటివరకు 1,06,11,731 మంది కోలుకున్నారు. శనివారం ఒక రోజులోనే 11,016 మంది డిశ్చార్జి అయ్యారు. కిందటేడాది అక్టోబర్ 1 నుంచి మరణాలు రేటు తగ్గుతూ వచ్చిందని, గడిచిన ఒకరోజులో దేశంలో 92 కరోనా మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాల సంఖ్య 1,55,642 కు పెరిగిందని హెల్త్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఆదివారం నాటికి 82 లక్షల మందికి కరోనా వ్యాక్సినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

కరోనా టీకా ఇస్తానని చెప్పి .. మత్తు మందిచ్చి బంగారం చోరీ

వైరల్ వీడియో: పాము రోడ్డు దాటడం కోసం ట్రాఫిక్ ఆపేశారు