దేశంలో వెయ్యి కరోనా మరణాలు

దేశంలో వెయ్యి కరోనా మరణాలు
  • మహారాష్ట్రలో అత్యధికంగా 400 మంది మృతి
  • 31 వేలు దాటిన కరోనా కేసుల సంఖ్య

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మృతుల సంఖ్య వెయ్యి క్రాస్ అయ్యింది. 24 గంటల్లో69 మంది కరోనాతో చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1000 దాటింది. మొత్తం కరోనా కేసులు కూడా 31, 411 కి చేరాయి. క్రమంగా కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గత 40 రోజుల్లోనే కరోనా మృతులు వెయ్యికి చేరారు. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుతున్నప్పటికీ కేసులు, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. కేరళ, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఐతే మహారాష్ట్రలో మాత్రం కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేసులు, మరణాల్లోనూ మహారాష్ట్ర టాప్ లో ఉంది. దాదాపు 4 వందల మంది ఈ స్టే్ట్ లోనే చనిపోయారు. 9300 మంది వరకు కరోనా బారిన పడ్డారు. ముంబై, పుణె నగరాల్లోనే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. మంగళవారం అత్యధికంగా మహారాష్ట్రలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో 19, మధ్యప్రదేశ్ 10, ఉత్తరప్రదేశ్ 3 మరణాలు నమోదయ్యాయి.
పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులు
మహారాష్ట్ర లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ (9,218) మంది కరోనా బాధితులుగా మారారు. ఇక గుజరాత్ లో (3,774), ఢిల్లీ(3314) మధ్యప్రదేశ్ (2,387), రాజస్థాన్ (2,364), తమిళనాడు (2058), యూపీ (2,053), ఆంధ్రప్రదేశ్ (1,259), తెలంగాణ (1,009), బెంగాల్ (697) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో కరోనా కేసుల్లో 9 స్థానంలో ఉంది. తొలి కేసు నమోదైన కేరళ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేరళతో పాటు కర్నాటక, పంజాబ్, హర్యానా లో కరోనా కేసులు కంట్రోల్ కి వస్తున్నాయి.
15 సిటిల్లో కరోనా తీవ్రత
పలు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఉన్నప్పటికీ అక్కడ కూడా కొన్ని నగరాల్లోనే దాదాపు సగానికి పైగా కేసులు నమోదవుతున్నాయి. అలాంటి 15 సిటిలను కేంద్రం గుర్తించింది. ఇందులో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్. హైదరాబాద్ లు ఉన్నాయి. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం 20 దేశాల్లో కన్నా భారత్ లో 200 రెట్లు డెత్ లు, 84 రెట్ల కేసులు నమోదవుతున్నాయి. మన దగ్గర ప్రతి 25 మందికి టెస్ట్ లు చేస్తే ఒకరికి కరోనా పాజిటివ్ గా తేలుతుందని కేంద్రం తెలిపింది.