ఒకే చోటు రెండు మూడు వ్యాపారాలు

V6 Velugu Posted on Nov 26, 2021

హైదరాబాద్, వెలుగు: సిటీలో ఏదైనా షాపు పెట్టాలంటే ముందుగా కమర్షియల్ స్పేస్​ వెతుక్కోవడం పెద్ద రిస్క్​. ఆపై  ప్లేస్ కోసం పెట్టే రెంట్​ కూడా ఎక్కువగా ఉంటుంది. ఏరియా, స్పేస్ ను  బట్టి వేలల్లో  అద్దెలు ఉంటాయి. రద్దీ, మార్కెట్ ఏరియాల్లో ఒక కమర్షియల్ స్పేస్ దొరకాలంటే చాలా కష్టం. కరోనాతో బిజినెస్ చేసే వారు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికీ అద్దెలు కూడా సరిగా కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి కష్టాల నుంచి బయటపడేందుకు కో–బిజినెస్ లు చేస్తున్నారు. బిజినెస్ చేస్తూనే షాపు ముందు ఖాళీ స్థలాన్ని మరొక బిజినెస్​కు అద్దెకు ఇస్తున్నారు. నెలకు కొంత రెంటు తీసుకుంటూ ఖర్చుల భారం తగ్గించుకుంటున్నారు. ఇదే కో– బిజినెస్ కాన్సెప్ట్. ఒకే ప్లేస్ లో రెండు, మూడు బిజినెస్​కు జరుగుతుంటాయి. ప్రస్తుతం చాలా చోట్ల ఇలాంటి బిజినెస్​లే కనిపిస్తున్నాయి. 

సొంతంగా బిజినెస్​లు పెట్టుకుంటుండగా..
కో–బిజినెస్ లు చిన్నస్థాయి నుంచి మోస్తరు పెట్టుబడితో వ్యాపారాలు చేసేవారికి ఎంతో ఉపయోగంగా మారాయి. కొవిడ్​తో జాబ్​లు కోల్పోవడంతో చాలామంది సొంతంగా బిజినెస్​లు చేసుకోవడంపై ఇంట్రెస్ట్ పెట్టారు. తక్కువ పెట్టుబడితోను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కమర్షియల్ స్పేస్ లు తీసుకుని మెయింటెనెన్స్ భారాన్ని భరించలేకపోతున్న ఓనర్లు తమ షాపుల ముందున్న ఖాళీ స్పేస్​ను రోడ్డు సైడ్ చిరు వ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారు. దీంతో ఇరువురికి ఖర్చులు కలిసివస్తున్నాయి. 

రెంట్ భారం తగ్గించుకునేందుకు..
ఓ హోటల్ ముందు పార్కింగ్ ఖాళీ స్థలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో పాటు జ్యూస్ బండి కూడా ఉంటున్నాయి. బేకరీ షాపు ముందు చిన్న టీ కొట్టు కనిపిస్తుంది. ఇవన్నీ వేర్వేరు వ్యాపారులకి చెందినవి. ఇలా ఖాళీ స్థలాన్ని కంబైన్డ్ బిజినెస్ కోసం ఉపయోగించుకుంటూ రెంట్ల భారం తగ్గించుకుంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు. 

ఖాళీ స్పేస్​లో కొంత అద్దెకు ఇచ్చాం 
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ తో పాటు ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టాం. షాపు ముందు పార్కింగ్ స్పేస్ చాలా ఖాళీగా ఉంది.  రెంట్​రూ. 60వేల పైనే కడుతున్నాం. ఖర్చులు తగ్గించుకునేందుకు కొంత స్పేస్ ని టీ పాయింట్ వాళ్లకి అద్దెకు ఇచ్చాం. నెలకు 10వేలు రెంటు తీసుకుంటున్నాం. ఫుడ్ సెంటర్ కి వచ్చే కస్టమర్లు టీ షాపుకి, అటు కస్టమర్లు ఇటు వస్తున్నారు. కొంత ఖర్చు కలిసి వస్తుంది. 
‑ శ్రవణ్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్  

రోడ్డు పక్కన పెట్టుకుంటే..
స్వీట్ షాప్ తో పాటు చాట్ బండార్ పెట్టాం. ప్లేస్ ఓనర్​కు  నెలకు రూ.10వేల అద్దె కడుతున్నాం. ఇంతకుముందు రోడ్డు పక్కన పెట్టుకుంటే ట్రాఫిక్ పోలీసులు తీసేయించేవారు. ప్రతిసారి ఎక్కడి వెళ్లాలో తెలిసేది కాదు. స్వీట్ హౌజ్ వద్ద  ప్లేస్ తీసుకుని ఖాళీ స్థలంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు బిజినెస్​ చేస్తున్నాం. 
‑ రషీద్,చాట్ బండార్ 

Tagged corona effect, covid effect, business ideas, business places, rents burden

Latest Videos

Subscribe Now

More News