కరోనా ఎఫెక్ట్ : సికింద్రబాద్ లో స్కూల్స్ కు సెలవులు

కరోనా ఎఫెక్ట్ :  సికింద్రబాద్ లో స్కూల్స్ కు సెలవులు

కరోనా బాధితుడికి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. దీంతో గాంధీ హాస్పిటల్, ఆ పరిసరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. డాక్టర్లు, నర్సులు, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, రోగులు, వారి సహాయకులు ఓపీకి వచ్చిన వారంతా మాస్కులు పెట్టుకునే కనిపిస్తున్నారు. గాంధీ మెయిన్ గేట్ మూసివేశారు. అక్కడ కరోనా అనుమానితులను తప్ప వేరే ఎవరిని అనుమతించకుండా రూల్ పెట్టారు. కరోనా అనుమానితులు వాడేందుకు రెండు లిప్టులను ప్రత్యేకంగా కేటాయించారు. డాక్టర్లు, రోగులు అందరినీ వెనుక వైపు నుంచి పంపిస్తున్నారు.

కరోనా బాధితుడు నేరుగా కాంటాక్ట్ అయిన 88 మందిని అధికారులు గుర్తించారు. వారిలో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అపోల్ డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ తో పాటు బెంగళూరు నుంచి హైద్రాబాద్ వచ్చిన బస్సు డ్రైవర్, కండక్టర్ సహా 45 మందిని గాంధీకి పిలిపించారు. ప్రస్తుతం వీరంతా గాంధీలోని ఐసేలేషన్ వార్డులు అబ్బర్వేషన్లో ఉన్నారు. వైరస్ బాధితుడు 10 రోజులు బయటే తిరగడంతో ఎంతమందిని కలిశాడోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం పేషంట్ పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్లు 24 గంటలు అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పారు గాంధీ హాస్పిటల్ సూపరిండెంట్ శ్రవణ్ కుమార్.

వైరస్ సోకిన వ్యక్తికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్, ఐసోలేషన్ విధానం అధ్యయనం చేసేందుకు డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లు టీమ్ కేరళకు వెళ్లనుంది. కేరళలో ముగ్గురికి వైరస్ వస్తే…. డాక్టర్ల ట్రీట్మెంట్ తో నయమైంది. దీంతో మన డాక్టర్ల టీంను అక్కడకు పంపాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇక మెడికల్ షాపుల్లో మాస్కులకు ఫుల్ డిమాండ్ వచ్చింది. ఒక్కరోజులోనే 500 మాస్కులు అమ్మినట్టు గాంధీ హాస్పిటల్లోనే మెడికల్ షాపు నిర్వాహకుడు తెలిపారు. ఇక N 95 మాస్కుల కొరత ఉందని చెప్పారు. కంపెనీలను బట్టి 200 నుంచి 3 వందల వరకు మాస్క్ లు అమ్ముతున్నారు.

కరోనా బాధితుడు ఉండే సికింద్రాబాద్ కంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ లో రోడ్లన్నీ బోసిపోయాయి. బాధితుడు ఉండే ఇంటి తలుపులు, కిటీకీలు మూసి ఐసోలేటెడ్ వార్డుగా మార్చారు. ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని చెప్పారు. ఇంటి చుట్టూ బ్లీచింగ్ చల్లి, కెమికల్స్ స్ప్రే చేశారు. మరోవైపు మహేంద్రహిల్స్ లో ఉన్న కొన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించని వారిని కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

see also: ఫీజు వసూల్ చేసి.. ఇంటర్ బోర్డుకు కట్టని కాలేజీ