డెలి‘వర్రీ’ బాయ్స్

డెలి‘వర్రీ’ బాయ్స్

స్టాఫ్ ను తగ్గించుకుంటున్న ఫుడ్ కంపెనీలు

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్​ ఫుడ్ డెలివరీ బాయ్స్ పైనా పడింది. వైరస్ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు ఇంకా ఓపెన్​ కాలేదు. ఆర్డర్ లు రాక, ఉపాధి లేక డెలివరీ బాయ్స్​ కు కష్టాలు తప్పడం లేదు. కరోనా సోకుతుందనే భయంతో ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్లు ఇచ్చేందు కు కస్టమర్లు ఇంట్రెస్ట్​ చూపిస్తలేరు. వచ్చి న ఆర్డర్లను డెలివరీ చేసినా కంపెనీలు శాలరీలో కట్టింగ్ పెడుతున్నాయి.

దీంతో కొలువు చేయలేక, శాలరీ సరిపోకున్నా పని చేయాల్సి వస్తుందని ఆవేదనలో పడ్డారు. లాక్ డౌన్ రోజుల్లో  ఆంక్షలు విధించడం. ఆ తర్వాత హోటల్ బిజినెస్ పూర్తిగా తెరుచుకోక పోవడంతో డెలివరి బాయ్స్​కు పనిలేకుండా పోయింది. సిటీలో ప్రధానంగా జొమోటో, స్విగ్గీ , ఫుడ్ పాండా , ఉబర్ కంపెనీలు ఫుడ్ డెలివరీ సర్వీసులు అందిస్తున్నాయి. 286 సెంటర్లలో దాదాపు 1.50లక్షల మంది పని చేస్తున్నారు. మొత్తం 12వేల హోటళ్లు ఉండగా, ఆన్ లైన్ బుకిం గ్ బిజినెస్ చేసేవి 8వేలకు పైగా ఉంటాయి. ఒక్కో హోటల్ సాధారణ రోజుల్లో 120 నుంచి 160 , వీకెండ్ లో 180 నుంచి 220 మధ్య సగటున డెలివరీలు చేస్తుంటాయి. లాక్ డౌన్​తో ఉపాధి లేక చాలా కంపెనీలు జాబ్ ల నుంచి డెలివరీ బాయ్స్​ను తొలగిస్తున్నాయి . కరోనా భయంతో కొందరు సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 40% శాతం కంటే తక్కువ మంది కూడా డ్యూటీ చేయడం లేదని డెలివరీ బాయ్స్ ప్రతినిధులు తెలిపారు.

జాబ్ లు తీసేస్తూ .. అలవెన్సులోనూ కటింగ్

కరోనాతో గిరాకీ లేక ఫుడ్ కంపెనీలన్నీ సిబ్బందిని తగ్గించుకున్నాయి. శాలరీ కంటే ఎక్కువగా వచ్చే కమీషన్, అలవెన్స్ పర్సంటేజీని భారీగా తగ్గించాయి. ప్రస్తుతం తప్పని పరిస్థితుల్లో  చేస్తున్నామని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో మూడేళ్లుగా పని చేస్తున్న ఫుడ్ డెలివరీ బాయ్ సుదర్శన్ చెప్పారు. ఇన్సెంటివ్స్, అలవెన్స్, ట్రాన్స్ పోర్టు చార్జీలను చెల్లించే కంపెనీ లు కూడా  కఠినంగా రూల్స్​ పెడుతూ తగ్గించు కుంటున్నాయని పేర్కొన్నారు. సిటీలో ఆన్ డ్యూటీలో ఉన్న డెలివరీ  బాయ్స్ సంఖ్య భారీగా తగ్గిందని, పని ఒత్తిడి, కమీషన్ తగ్గింపుతో జాబ్ చేయలేక వె ళ్లిపోయేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆఫ్ డే డ్యూటీ చేస్తే రూ.200

షిప్టుల వారీగా 12 గంటల డ్యూటీ టైమ్​ అమలు చేస్తున్నారు. అలవెన్సు లు, ఎర్నింగ్, ఇన్సెంటివ్ అన్ని కలిపితే డైలీ రూ. 600 నుంచి 900 వరకు వచ్చేవి. ప్రస్తుతం టార్గెట్ పూర్తి చేసిన డెలివరీ ఎర్నింగ్ రూ. 200 నుంచి 300 మధ్య కంపెనీలు చెల్లిస్తున్నాయి. ఒక్కో డెలివరీ కిలోమీటర్ల దూరాన్ని బట్టి స్లాబుల వారీగా రూ.12, 15, 18 చెల్లించే కంపెనీలు కూడా రూ.6 లకు మించి చెల్లించడం లేదు. ఇక టార్గెట్ పూర్తి చేస్తే ఇన్సెంటివ్స్ ను కూడా ఇవ్వడం లేదని పలువురు డెలివరీ బాయ్స్​ వాపోతున్నారు.

కమీషన్ తగ్గించలేదు

దేశ వ్యాప్తంగా 12 సిటీల్లోని డెలివరీ బాయ్స్  సర్వీసులు బంద్​పెట్టారు. కమీషన్ తగ్గించలేదని, ఫీజులో ఎలాంటి మార్పూలేదని వారం మొత్తంలో రూ. ఒక్కో ఆర్డర్ కు రూ. 45 డెలివరీ పార్టనర్లకు చెల్లిస్తున్నామని స్విగ్గీ సంస్థ ప్రతినిధులు చెప్తు న్నారు. అధికంగా రూ.100 పొందిన డెలివరీ బాయ్స్ కూడా ఉన్నారని స్పష్టం చేసింది. డెలివరీ పార్టనర్ల సర్వీసులకు సరైన గుర్తింపునిస్తున్నామంటూ పేర్కొన్నారు.

ఎంతిచ్చారో మేనేజ్ మెంట్లు చెప్పాలి

డెలివరీ బాయ్స్ కు ఇప్పటి వరకు ఎంత చెల్లించారో ఫుడ్ కంపెనీలు చెప్పాలి. బతుకు దెరువు కోసం ఫుడ్ డెలివరీ బాయ్స్ గా పనిచేస్తుంటే, నిలువునా దోచుకుంటున్నాయి. సిటీలో ఒక్కో డెలివరీ పార్ట్ నర్ ఎంతమేర సంపాదించారో తెలపాలి. కోవిడ్ టైంలో పనిచేసిన కార్మికుల్లో ఎంతమంది ఇన్సూరెన్స్ తో లబ్ధి పొందారనేది మేనేజ్ మెంట్లు స్పష్టం చేయాలి. సలావుద్దీన్, ప్రధాన కార్యదర్శి, యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్.