జియాగూడ మేకల మండీపై కరోనా ప్రభావం

జియాగూడ మేకల మండీపై కరోనా ప్రభావం

హైదరాబాద్ : జియాగూడ మేకల మండీపై కరోనా ప్రభావం పడింది. నిత్యం లక్షల్లో వ్యాపారం జరిగే  మేకల మండీలో  ప్రస్తుతం  గిరాకీ లేకుండా పోయింది. తెలంగాణతో  పాటు  ఇతర రాష్ట్రాల  నుంచి గొర్రెలు, మేకలను  జియాగూడ  మార్కెట్ కు  తీసుకొచ్చి  అమ్ముతుంటారు వ్యాపారులు.  మేకలు, పొట్టేళ్ల  కోసం  వచ్చే కస్టమర్లతో  ఎప్పుడు సందడిగా  ఉండే  మేకలమండీ…. ప్రస్తుతం  కరోనాతో ఎగుమతి, దిగుమతులు  లేక చిన్నబోతుంది.

జియాగూడ మేకలమంమీ గత ఆరు నెలలుగా బిజినెస్ లేక డీలా పడింది. లాక్ డౌన్ సడలిపుల తర్వాత మండీ తిరిగి ప్రారభమైతా బిజినెస్ పూర్తిస్థాయిలో జరగడం లేదు. మేకలు లేక బిజినెస్ జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులు. కరోనా కేసులు పెరగడంతో జనం మండీకి రావడం లేదంటున్నారు వ్యాపారులు. గతంలో రోజుకు కొన్ని క్వింటాళ్ల మటన్ హోటల్స్, రెస్టారెంట్స్, బార్లకు సప్లమ్ చేసేవాళ్ళమనీ….ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటున్నారు. కనీసం మేకలను కొన్న రేటు కూడా రావడం లేదనీ..ఆరు నెలలుగా వర్కర్లకు జీతాలు ఇవ్వడం కూడా భారంగా మారిందటున్నారు వ్యాపారులు.

కరోనాకు ముందు రోజుకు ఐదారు వందలు సంపాదించేవారమనీ…. ప్రస్తుతం వంద రూపాయలు కూడా రావట్లేదంటున్నారు ఆరె కటికలు. జియాగూడ మేకలమండీని నమ్ముకొని  5 వేల కుటుంబాలు జీవిస్తున్నాయనీ..ఆరు నెలలుగా ఇంటి అద్దెలు, కరెంట్ బిల్లులు కట్టలేక అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనాతో నిత్యావసర ధరలతో పాటు నాన్ వెజ్ ధరలు కూడా భారీగా పెరిగాయంటున్నారు కస్టమర్లు. లాక్ డౌన్ కు మందు ఐదారు వేలకు వచ్చే గొర్రె, మేక.. ఇప్పుడు 7వేలు పెట్టినా రావడం లేదంటున్నారు. కరోనా కారణంగా ఆరు నెలలుగా బిజినెస్ లేక ఇబ్బందులు పడ్డ వ్యాపారులు..అన్ లాక్ లో భాగంగా మేకలమండీ ప్రారంభమైనా గిరాకీ లేక దివాలా తీస్తున్నట్టు చెబుతున్నారు.