కరీంనగర్‌లో కరోనా తొలి పాజిటివ్ కేసు

కరీంనగర్‌లో కరోనా తొలి పాజిటివ్ కేసు

తెలంగాణలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా రెండో కేసు నమోదైంది. ఇండోనేషియా నుంచి వచ్చిన మతప్రచారకుల బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో కరీంనగర్ అంతా హైఅలర్ట్ ప్రకటించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్‌తో కలిసి అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి గంగుల కాసేపట్లో అధికారులతో కలిసి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హుటాహుటిన కరీంనగర్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఆ వ్యక్తితో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారో వారి వివరాలు కూడా తెలుసుకోవాలని కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీ చేశారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో ఎవరైతే తిరిగారో.. వాళ్లు వెంటనే ఆస్పత్రికి వచ్చి కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. అంతేకాకుండా.. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కరీంనగర్‌లో ఒక కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడని సమాచారం. అలా అయితే కోచింగ్ సెంటర్‌కు వచ్చే విద్యార్థులను కూడా కరోనా టెస్టు చేయాల్సిన అవసరం ఉంటుంది. వెంటనే అప్రత్తమైన పారిశుద్ద్య యంత్రాంగం.. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి 3 కిలోమీటర్ల చుట్టుపక్కల రోడ్లపై స్ప్రె చేస్తున్నారు. కరీంనగర్‌లో ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించాలని.. ఎవరూ ఇంట్లోంచి బయటకు రావొద్దని కలెక్టర్ శశాంక కోరారు. ఈ కేసుతో తెలంగాణలో మొత్తం కేసులు 28కి చేరాయి.

For More News..

లాక్‌డౌన్‌పై మోడీ కీలక వ్యాఖ్యలు

జిల్లాల వారీగా కరోనా పేషెంట్ల వివరాలివే

లాక్‌డౌన్‌కు సంబంధించి పూర్తి వివరాలు

జనతా కర్ఫ్యూ దేశమంతా సక్సెస్

263 మందితో ఢిల్లీ చేరిన ఇటలీ విమానం

తక్కువలో తక్కువ 20 కోట్ల మందికి సోకే అవకాశం