
న్యూఢిల్లీ: ధర్మశాలలోని గ్యుటో తాంత్రిక మఠంలో 150 మందికి పైగా సన్యాసులు కరోనా బారిన పడినట్లు అక్కడి హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రా జిల్లాలో ఇప్పటివరకు 300 మందికి పైగా సన్యాసులకు కరోనా సోకిందని, అందు లో హెల్త్ కండిషన్ సీరియస్‌గా ఉన్న ఒకరిని ఆస్పత్రికి తరలించామని తెలిపింది. మిగతావారిని మఠంలోనే క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొంది. ప్రస్తుతం హిమాచల్‌లో 434 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు హర్యానా రాష్ట్రం కర్నాల్‌లోని ఓ స్కూల్లో 54 మంది స్టూడెంట్లకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో స్కూల్ మూసేసి ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్ చేశారు. డిసెంబర్ నుంచే రాష్ట్రంలో నైన్త్ నుంచి ఇంటర్ దాకా, ఫిబ్రవరి 24 నుంచి 3 ఆపై తరగతుల క్లాసులు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.