కరోనా ఫర్ సేల్: రోడ్లపై వ్యాపారి మార్కెటింగ్ టెక్నిక్

కరోనా ఫర్ సేల్: రోడ్లపై వ్యాపారి మార్కెటింగ్ టెక్నిక్

కరోనా వైరస్ భయంతో ఫేస్ మాస్కులకు డిమాండ్ పెరిగింది. జనాలంతా వాటి కోసం మెడికల్ షాపులకు పరుగు పెట్టడంతో భారీగా రేట్లు పెంచేశారు. కనీసం ఐదు రూపాయాలకు మించని మాస్కుల ధరను రూ.20కి పెంచి అమ్ముతున్నారు మెడికల్ షాపుల యజమానులు. ఈ డిమాండ్‌ను గమనించి ఓ వ్యక్తి తన మార్కెటింగ్ స్కిల్స్‌తో నేరుగా ఫీల్డ్‌లోకి దిగాడు. జనాలు మెడికల్ షాపులు దాకా వచ్చే పనిలేకుండా వాళ్ల మధ్యకే వెళ్లాడు. మాస్కులు చేతబట్టుకుని.. బిజీ రోడ్లపైనే సేల్స్ మొదలుపెట్టాడు.

हा कोरोना विकतोय की मास्क??

Posted by माहितीदूत on Tuesday, March 10, 2020

మాస్కులను రోడ్లపై అమ్మాలన్న ఆలోచన వరకు బాగానే ఉంది. అతడు అమ్ముతున్న తీరే వెరైటీగా ఉంది. జనాన్ని ఆకట్టుకుంటోంది. ‘కరోనా కరోనా.. బీస్ రుపియే.. బీస్ రుపియే కరోనా’ అంటూ హిందీలో అరుస్తూ.. మాస్కుల్ని కరోనా పేరుతో అమ్మేస్తున్నాడు. అయితే ఇది ఎక్కడన్నది స్పష్టంగా తెలియడం లేదు. 20 రూపాయలకే కరోనా అంటూ అతడు రోడ్లపై అమ్ముతున్న తీరును కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో జోరుగా వైరల్ అవుతోంది. కొంత మంది కరోనా ఫర్ సేల్ అని క్యాప్షన్లు పెట్టి ఆ వీడియోను పోస్ట్ చేస్తున్నారు. కరోనా.. కరోనా అంటూ తెలివిగా కొనాలని లేని వారిని కూడా భయపెట్టి క్యాష్ చేసుకుంటున్నాడంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘మాస్కులు అమ్ముతున్న అతడు మాత్రం పెట్టుకోలేదు.. వాటితో పెద్దగా ప్రయోజనం లేదని అతడికి తెలుసంటూ ఇంకొందరు కామెంట్ చేశారు.