కరోనా ఇంకా పోలేదు.. జర భద్రం

కరోనా ఇంకా పోలేదు.. జర భద్రం

విఖే పాటిల్ ఆటోబయోగ్రఫీ ఫంక్షన్‌‌‌‌‌‌‌‌లో ప్రధాని మోడీ

రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు ప్రధాని మోడీ. అగ్రి కల్చర్ సెక్టార్​లో చారిత్రక రిఫామ్స్ తెచ్చామని, రైతులు ఆంత్రప్రెన్యూర్స్​గా మారే అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్ లో పాలు, చక్కె ర, గోధుమ అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. లోకల్ ఎంటర్ ప్రైజ్ మోడల్ ద్వారా దేశం ముందుకెళ్తదన్నారు.

ముంబై: కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని నరేంద్ర  మోడీ సూచించారు. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. వ్యాక్సిన్ వచ్చేవరకూ మాస్కులు ధరించాలని, తరుచూ హ్యాండ్ వాష్ చేసుకోవాలని, పర్సనల్ హైజిన్, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని ప్రజలను కోరారు. మంగళవారం కేంద్ర మాజీ మంత్రి బాలాసాబెబ్ విఖే పాటిల్ ఆటోబయోగ్రఫీని రిలీజ్ చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ మాట్లాడారు.

రైతుల ఖాతాల్లోకి లక్ష కోట్లు

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతుల అకౌంట్లలోకి ఇప్పటివరకు లక్ష కోట్ల రూపాయలు బదిలీ చేశామని మోడీ చెప్పారు. దళారుల ప్రమేయంలేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశామని చెప్పారు. కోల్డ్ చెయిన్లు, మెగా ఫుడ్ పార్క్ లు, ఆగ్రో ప్రాసెసింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫుడ్ కొరత ఉండేదన్నారు. ఫుడ్ ప్రొడక్షన్ ను పెంచడమే అప్పటి ప్రభుత్వాలకు ప్రయారిటీగా మారిందని, రైతులు కూడా చెమటోడ్చి ఆ లక్ష్యాన్ని సాధించారని అన్నారు. అప్పట్లో ప్రభుత్వాలు, ప్రభుత్వ విధానాలు ఉత్పత్తిపై మాత్రమే దృష్టి పెట్టాయని, రైతులకు లాభం చేకూర్చేందుకు ప్రయత్నించలేదన్నారు. అయితే తొలిసారి ఆ ఆలోచన విధానం మారిందని, తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుందన్నారు. మద్దతు ధర పెంచామని, యూరియా సప్లయ్ లో అక్రమాలు అడ్డుకునేందుకు వేప పూసిన యూరియా తీసుకొచ్చామని, రైతుల బాధను దూరం చేసేందుకు క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేశామన్నారు. 2014 తర్వాత మహారాష్ట్రలో తాగు, సాగునీటి సప్లయ్ ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేశామన్నారు. ప్రధాన మంత్రి కృషి సించయ్ యోజన ద్వారా మహారాష్ట్రలో పెండింగ్​లో ఉన్న 26 ప్రాజెక్టుల పనులు స్టార్ట్ చేశామని, 9 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామన్నారు. దీంతో 5 లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్​కు చెందిన 7 కోట్ల మహిళలకు రూ.3 లక్షల కోట్ల రుణాలిచ్చామని చెప్పారు. కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, బాలా సాహెబ్ విఖే పాటిల్ కుమారుడు రాధాకృష్ణ విఖే పాటిల్, బీజేపీ నేతలు ఫడ్నవీస్, చంద్రకాంత్
పాటిల్ పాల్గొన్నారు.