కరోనా అంత పెద్ద వ్యాధి కాదు: మైకేల్

కరోనా అంత పెద్ద వ్యాధి కాదు: మైకేల్
ప్రపంచ దేశాలపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపిస్తూనే ఉంది. అయితే కరోనా అంత పెద్ద వ్యాధి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తెలిపింది. భవిష్యత్తులో ఇంతకంటే తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాలు రానున్నాయని హెచ్చరించింది. ప్రపంచ దేశాలు వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని WHO ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ రయాన్ సూచించారు. కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాపించిందని… మొదట్లో అది చాలా తీవ్రంగా ఉండేదని గుర్తు చేశారు. కొన్ని కోట్ల మందికి సోకి లక్షలాది మందిని చంపేసిందన్నారు.అంతేకాదు చాలా మందిని అగాథంలోకి నెట్టేసిందని తెలిపారు మైఖేల్. అయితే… ప్రస్తుతం ఉన్న వేరే జబ్బులతో పోలిస్తే కరోనా మరణాల రేటు చాలా తక్కువని చెప్పారు. దాని గురించి అంతగా భయపడాల్సిందేమీ లేదన్నారు స్పష్టం చేశారు.