దేశవ్యాప్తంగా నేటి నుంచే టీకా

దేశవ్యాప్తంగా నేటి నుంచే టీకా

హెల్త్​ వర్కర్లతో మొదలు.. విడతల వారీగా అందరికీ

తొలిరోజు వ్యాక్సినేషన్

దేశవ్యాప్తం గా 3 లక్షల మందికి
రాష్ట్రంలో 4,200 మందికి

ఫస్ట్ ఫేజ్ లో ఎవరికి?

హెల్త్​, ఐసీడీఎస్ వర్కర్లు తర్వాత మిగతా ఫ్రంట్ లైన్ వర్కర్లకు 

న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధానికి వ్యాక్సిన్​తో దేశం సిద్ధమైంది. ‘కొవిషీల్డ్’, ‘కొవాగ్జిన్’​ టీకాల  డ్రైవ్​ శనివారం నుంచి మొదలు కానుంది. రాష్ట్రంలో కూడా కరోనా వ్యాక్సినేషన్​కు అన్ని ఏర్పాట్లు  పూర్తిచేశారు. దేశవ్యాప్తంగా మూడు, నాలుగు నెలల్లో  30 కోట్ల మందికి టీకా వేయాలని కేంద్రం టార్గెట్​గా పెట్టుకుంది. విడతల వారీగా దేశప్రజలందరికీ వ్యాక్సిన్​ అందుబాటులోకి తీసుకువస్తామని  ప్రకటించింది. కరోనా టీకాలు తీసుకునేవాళ్లు తప్పకుండా గైడ్​లైన్స్​ పాటించాలని సూచించింది. 18 ఏండ్లు దాటినవాళ్లకే టీకాలు వేయాలని, గర్భిణులు, బాలింతలకు వేయొద్దని స్పష్టం చేసింది.  ఫస్ట్​ డోస్​ ఏ కంపెనీది వేసుకుంటే సెకండ్​ డోస్​ కూడా అదే కంపెనీది వేసుకోవాలని సూచించింది.

ప్రారంభించనున్న ప్రధాని మోడీ

కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రధాని నరేం ద్రమోడీ శనివారం ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి వర్చువల్ మీటిం గ్ ద్వారా ఆయన ఉదయం 10.30 గంటలకు ఈ డ్రైవ్ ను స్టార్ట్​ చేస్తారు. దేశవ్యాప్తంగా కనీసం 60 హాస్పిటల్స్​ సిబ్బందితో, వ్యాక్సిన్ వేసుకునేవాళ్లతో ముచ్చటించనున్నారు. మన రాష్ట్రంలోని గాంధీ హాస్పిటల్ , నార్సింగి రూరల్ హెల్త్ సెంటర్ స్టాఫ్ తో మాట్లాడుతారు.

వ్యాక్సినేషన్​ స్టార్ట్​ కానున్న తొలిరోజు శనివారం దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి టీకా వేస్తారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు కొవిషీల్డ్​, కొవాగ్జిన్​  పంపారు.  ప్రయార్టీ లిస్టు ప్రకారం మొదట హెల్త్​, ఐసీడీఎస్​(ఇంటిగ్రేటెడ్​ చైల్డ్​ డెవలప్​మెంట్​ సర్వీస్) వర్కర్స్​కు  టీకా వేస్తారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 3,006  కేంద్రాల్లో తొలిరోజు ఒక్కో సెంటర్లో సుమారు 100 మందికి వ్యాక్సిన్​ వేస్తారు. తెలంగాణలో ప్రతి సెంటర్​లో 30 మందికి చొప్పున వ్యాక్సిన్​ వేయనున్నారు. ప్రపంచంలోనే లార్జెస్ట్​ వ్యాక్సినేషన్​ ప్రోగ్రాంగా పిలుస్తున్న ఈ డ్రైవ్​ నిరంతరం కొనసాగుతుంది. మొదటి విడతలో భాగంగా పది రోజుల్లో హెల్త్​ వర్కర్స్​కు వ్యాక్సినేషన్​ పూర్తవుతుంది. తర్వాత మిగతా ఫ్రంట్​లైన్​ వర్కర్స్​కు, ప్రయార్టీ లిస్టుకు వ్యాక్సినేషన్​ ఉంటుంది. హెల్త్​ కేర్​, ఫ్రంట్​లైన్​ వర్కర్స్​ కోసం వ్యాక్సిన్​ ఖర్చును తామే భరిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు.  ఇలా 3 కోట్ల మందికి కేంద్రమే టీకా వేయించనుంది.

1.65 కోట్ల డోసులు సరఫరా

ఇప్పటికే దేశవ్యాప్తంగా కోటీ 65 లక్షల వ్యాక్సిన్​ డోసులను కేంద్రం సరఫరా చేసింది. ఇందులో ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ కనిపెట్టిన, ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్​ ఒకటి. ఈ టీకాను మనదేశంలో సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ తయారు చేస్తోంది. మరో టీకా ‘కొవాగ్జిన్’. దీన్ని మన హైదరాబాద్​ కంపెనీ భారత్​ బయోటెక్​ రూపొందించింది.   వ్యాక్సినేషన్​ను కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిశీలించనుంది. వ్యాక్సిన్​ వేసుకునేవారి పేర్లను ఇప్పటికే ‘కొవిన్​’ వెబ్​సైట్​, యాప్​లో నమోదు చేశారు. వ్యాక్సిన్​ తీసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ వెబ్​సైట్​ లేదా యాప్​లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్​ స్టాక్​, బెనిఫిషియరీస్​ వివరాలు కొవిన్​ వెబ్​సైట్​లో ఉంటాయి. మొదటి డోస్​ తీసుకున్నాక 28 రోజులకు రెండో డోస్​ వేస్తారు. రెండు డోస్​లు తప్పనిసరిగా తీసుకోవాలి. రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్​ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి బట్టి వారంలో 3 నుంచి 4 రోజలు వ్యాక్సిన్​ వేస్తారు.

అంతా రెడీ

శనివారం ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ డ్రైవ్​కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధమయ్యాయి. వ్యాక్సిన్​ వేసుకునేవారు ఎవరు? వేసే వారు ఎవరు? అనే లిస్టును ఆఫీసర్లు రెడీ చేశారు. వ్యాక్సినేషన్​ స్టార్టవుతున్నందున అన్ని కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్​ను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తుండగా.. ఆయా రాష్ట్రాల్లో మంత్రులు, గవర్నర్​లో ప్రారంభించనున్నారు. వ్యాక్సిన్​ కోసం ఎగబడొద్దని, ప్రయార్టీ ప్రకారం అందరికీ అందేలా చూస్తామని అధికారులు చెప్తున్నారు.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!