దేశంలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ.. ఢిల్లీలోని అనేక ఏరియాల్లోని ప్రజలకు కొత్త కష్టం వచ్చిపడింది. ఎండాకాలం మొదలైన కొద్ది రోజులకే తాగునీటి కొరత సామాన్యుల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. మూడు నాలుగు రోజులకొకసారి మాత్రమే నీళ్లు వస్తున్న పరిస్థితి నెలకొంది. అది కూడా ఢిల్లీ వాటర్ బోర్డు ట్యాంకర్లు వస్తేనే తప్ప మరో మార్గం లేదు. నలుగురిలోకి వస్తే కరోనా వైరస్ అంటుకుంటుదేమోనన్న భయపడుతున్న జనం.. తాగునీటి కోసం గంటల కొద్దీ క్యూల్లో నిలబడాల్సి వస్తోంది.
Delhi: People in Chilla village line up to collect drinking water from Delhi Jal Board (DJB) trucks, amid #CoronaLockdown. They says, "we have to queue up for at least 2-3 hours to collect drinking water due to shortage of water. The water tanker comes only once in 3-4 days". pic.twitter.com/jRo5XpJ01S
— ANI (@ANI) April 18, 2020
ఓ వైపు దేశమంతా లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ ఢిల్లీలోని చిల్లా, న్యూ అశోక్ నగర్ సహా పలు ప్రాంతాల్లోని ప్రజలు ఢిల్లీ జల్ బార్డు వాటర్ ట్యాంకర్ రాగానే బిందెలతో పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి అంటుకునే ప్రమాదం ఉందని, ఏదైనా అవసరంతో బయటకు వచ్చినా మనిషికీ మనిషికి మధ్య రెండు మీటర్ల వరకు దూరం ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ, నీటి కోసం క్యూలో నిల్చున్న జనం సోషల్ డిస్టెన్స్ పాటించడం మర్చిపోయారు. ఈ జనంలో ఏ ఒక్కరికి వైరస్ సోకి ఉన్న వందల మందికి వ్యాపించే ప్రమాదం ఉంది. అయితే మూడు నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్ల ట్యాంకర్ వస్తోందని, గంటల పాటు క్యూలో నిల్చుని నీళ్లు పట్టుకుంటున్నామని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
Delhi: People line up to collect drinking water from Delhi Jal Board (DJB) trucks, amid #CoronaLockdown. Visuals from the New Ashok Nagar area. pic.twitter.com/AobzDpkbmZ
— ANI (@ANI) April 18, 2020
దేశ వ్యాప్తంగా 14348 కరోనా కేసులు నమోదు కాగా అందులో అత్యధికంగా మహారాష్ట్రలో 3323 కేసులు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో 1707 కేసులతో ఢిల్లీనే ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు 42 మంది మరణించారు. ఢిల్లీలో సుమారు 65 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్స్ గా గుర్తించింది ప్రభుత్వం.
