మే 4 నుంచి లిక్క‌ర్ షాపులు ఓపెన్: క‌ండిష‌న్స్ అప్లై

మే 4 నుంచి లిక్క‌ర్ షాపులు ఓపెన్: క‌ండిష‌న్స్ అప్లై

క‌రోనా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం లాక్ డౌన్ ను మే 3 త‌ర్వాత కూడా పొడిగించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దేశ వ్యాప్తంగా మ‌రో రెండు వారాల పాటు మే 17 వ‌ర‌కు లాక్ డౌన్ కొన‌సాగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దేశ‌మంతా రాత్రి 7 నుంచి ఉద‌యం 7 వ‌ర‌కు అన్ని నాన్ ఎసెన్షియ‌ల్ సర్వీసుల‌ను బంద్ చేయాల‌ని ఆదేశించింది. అయితే జిల్లాల వారీగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభ‌జించి కొన్ని కార్య‌క‌లాపాల‌కు అనుమ‌తిస్తూ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. జోన్ల‌తో సంబంధం లేకుండా ఉపాధి హామీ ప‌నులు చేసుకునే అవ‌కాశం ఇచ్చింది. అలాగే కొన్ని ర‌కాల ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చింది.

దేశ‌మంతా రైళ్లు, విమాన సర్వీసులు, మాల్స్, థియేట‌ర్లు, స్కూళ్లు, కాలేజీలు, హోట‌ళ్లు, రెస్టారెంట్లు పూర్తిగా బంద్ చేయాల‌ని ఆదేశించింది. అయితే ఆరెంజ్ గ్రీన్ జోన్ల‌లో ప‌రిమిత స్థాయిలో ఆయా జిల్లాల్లో ర‌వాణాకు అనుమ‌తి ఇచ్చింది. కాబ్స్ లో డ్రైవ‌ర్ తోపాటు మ‌రో ఇద్ద‌రు ప్ర‌యాణించే వీలు క‌ల్పించింది. గ్రీన్ జోన్ల‌లో 50 శాతం సీటింగ్ తో ఆర్టీసీ బ‌స్సుల‌ను కూడా తిప్పేందుకు అవ‌కాశం ఇచ్చింది. అలాగే రాష్ట్రాలు ఆదాయాన్ని పెంచుకునేందుకు గ్రీన్ జోన్ల‌లో లిక్క‌ర్ షాపులు, పాన్ షాపుల‌ను ఓపెన్ చేసేందుకు వీలు క‌ల్పించింది. అయితే ఒకేసారి ఈ షాపుల ద‌గ్గ‌ర ఐదుగురికి మించి ఉండ‌డానికి లేద‌ని, ఒక్కొక్క‌రికి మ‌ధ్య క‌నీసం రెండు మీట‌ర్ల దూరం ఉండాల‌ని ఆదేశించింది కేంద్ర హోం శాఖ‌.

More News:

బైక్ పై ఇద్ద‌రికి ఓకే.. ఆర్టీసీ బస్సులు స్టార్ట్: జోన్ల వారీగా ఏయే స‌ర్వీసులంటే..

మే 17 వ‌ర‌కు లాక్ డౌన్: రెడ్ జోన్ల‌లోనూ ఈ స‌ర్వీసులు ఓపెన్

జోన్ల‌తో సంబంధం లేకుండా దేశ‌మంతా ఇవి క్లోజ్