మే 7 నుంచి త‌మిళ‌నాడులో‌ లిక్క‌ర్ షాప్స్ ఓపెన్.. వ‌య‌సు వారీగా టైమింగ్స్

మే 7 నుంచి త‌మిళ‌నాడులో‌ లిక్క‌ర్ షాప్స్ ఓపెన్.. వ‌య‌సు వారీగా టైమింగ్స్

క‌రోనా లాక్ డౌన్ కారణంగా మూత‌ప‌డిన లిక్క‌ర్ షాపుల‌ను త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం మే 7 నుంచి ఓపెన్ చేయ‌బోతోంది. కేంద్రం ఆంక్ష‌ల స‌డ‌లింపు ఇవ్వ‌డంతో దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో సోమవారం నుంచే మ‌ద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మూడ్రోజుల ఆల‌స్యంగా త‌మిళ‌నాడులోనూ లిక్క‌ర్ షాపులు ఓపెన్ అవుతున్నాయి. కంటైన్మెంట్ జోన్లు మిన‌హా గ్రీన్, రెడ్, ఆరెంజ్ అన్ని జోన్ల‌లోనూ లిక్క‌ర్ సేల్స్ ఉంటాయ‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే ఆ రాష్ట్రంలో అత్య‌ధిక క‌రోనా కేసులు చెన్నైలోనే ఉండ‌డంతో సిటీలో మాత్రం షాపులు తెర‌వ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.

15 శాతం రేట్ల పెంపు

లిక్క‌ర్ రేట్ల విష‌యంలో ఇత‌ర రాష్ట్రాల బాట‌లోనే ప‌య‌నించింది త‌మిళ‌నాడు స‌ర్కార్. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ స‌హా కొన్ని రాష్ట్రాలు లిక్క‌ర్ రేట్ల‌ను పెంచ‌గా.. అదే బాట‌లో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కూడా ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. ఇండియ‌న్ బేడ్ ఫారెన్ లిక్క‌ర్ బ్రాండ్ల‌పై 15 శాతం ధ‌ర‌లు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. నార్మ‌ల్ బ్రాండ్ల‌పై 180 ఎంఎల్ బాటిల్ కు రూ.10, ప్రీమియం బ్రాండ్ల‌పై రూ.20 చొప్పున ధ‌ర‌లు పెరిగాయి.

గుంపును కంట్రోల్ చేసేందుకు టైమ్ స్లాట్ సిస్ట‌మ్..

దేశ వ్యాప్తంగా దాదాపు నెల‌న్న‌ర రోజుల నుంచి లిక్క‌ర్ దొర‌క్క‌పోవ‌డంతో షాపులు తెర‌వ‌గానే మ‌ద్యం ప్రియుల‌కు ఒక్క‌సారిగా గుంపులుగా ఎగ‌బ‌డ్డారు. సోష‌ల్ డిస్ట‌న్స్ నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఒక‌రిపై ఒక‌రు ప‌డి తోసుకుంటూ మ‌ద్యం కొనుగోలు చేశారు. దీంతో ఈ గుంపుల‌ను కంట్రోల్ చేయ‌డానికి త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం టైమ్ స్లాట్ విధానాన్ని ఎంచుకుంది. వ‌య‌సుల వారీగా టైమ్ కేటాయించి.. ఆయా స‌మ‌యాల్లోనే లిక్క‌ర్ షాపుల‌కు రావాల‌ని ఆదేశించింది.

వయసుల‌ వారీగా టైమ్ స్లాట్..

  • ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1 గంట వరకు 50 ఏళ్ల‌ పైబడినవారికి..
  • మద్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు 40 – 50 ఏళ్ల‌ మద్య వారికి..
  • మద్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 30 ఏళ్ల‌ లోపు వారికి మ‌ద్యం కొనుగోలుకు అనుమతి ఇచ్చింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం.
  • షాపుల ద‌గ్గ‌ర ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటే టోకన్లు ఇచ్చి జ‌నాల్ని నియంత్రించాలని అధికారులు ఆదేశించారు.
  • ఇత‌ర రాష్ట్రాల‌తో స‌రిహ‌ద్దు ఉన్న‌ ప్రాంతాల్లో మ‌ద్యం కావాలంటే ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా తెచ్చుకోవాల‌ని సూచించారు అధికారులు.