గాంధీలో కరోనా పేషెంట్ కేర్ సిబ్బంది ధర్నా

గాంధీలో కరోనా పేషెంట్ కేర్ సిబ్బంది ధర్నా

పద్మారావునగర్, వెలుగు: ప్రాణాలకు తెగించి పని చేసిన తమను విధుల్లో నుంచి తొలగించడం దారుణమని కరోనా పేషెంట్ కేర్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గాంధీ ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. అక్కడ టెంట్ వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. 2020లో గాంధీ ఆస్పత్రిలో కరోనా నోడల్ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కరోనా పేషెంట్లకు సేవలందించేందుకు 244 మంది పేషెంట్ కేర్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించింది. ఆ తర్వాత ఏటా వాళ్ల కాంట్రాక్ట్ పీరియడ్ పొడిగిస్తూ వచ్చింది.

అయితే ఈ ఏడాది ఏప్రిల్​ 30న వాళ్లందరినీ విధుల్లో నుంచి తొలగించింది. దీంతో సిబ్బంది ఆందోళన బాట పట్టారు. గాంధీ ఆస్పత్రిలో పేషెంట్​కేర్​సిబ్బంది కొరత ఉంది. అందుకే మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంత్రులు, వైద్య శాఖ అధికారులను ఎన్నోసార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చాం. అయినా స్పందించడం లేదు.