కరోనా పేషంట్ పై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

కరోనా పేషంట్ పై అత్యాచారం.. పోలీసుల అదుపులో నిందితుడు

కరోనా సోకి క్వారంటైన్ సెంటర్ లో చేరితే.. అత్యాచారానికి గురైన ఘటన మహారాష్ట్రలో జరిగింది. కరోనా సోకిన వారిని మరియు అనుమానితులను పన్వెల్ లోని క్వారంటైన్ సెంటర్ లో ఉంచుతున్నారు. అక్కడ ఒక నలభై ఏళ్ల మహిళ కరోనా పాజిటివ్ తో చేరింది. ఆమె పై గుర్తుతెలియని వ్యక్తి గురువారం అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై పన్వెల్ జోన్ -2 ACP రవీంద్ర గీతే మాట్లాడుతూ.. ‘క్వారంటైన్ సెంటర్ లో దాదాపు 400 మంది ఉన్నారు. అక్కడ పాజిటివ్ వచ్చిన ఒక మహిళపై అత్యాచారం జరిగింది. విషయం తెలిసిన వెంటనే.. అక్కడికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేశాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

ఈ సంఘటనపై స్థానిక బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కొన్ని క్వారంటైన్ కేంద్రాలు సమయానికి భోజనం కూడా అందించడం లేదు’ అని బీజేపీ నేత రామ్ కదమ్ అన్నారు.

For More News..

పైలట్ వర్గానికి ఊరటనిచ్చిన రాజస్థాన్ హైకోర్టు

లవర్ కోసం నడుస్తూ పాక్ బార్డర్ చేరిన యువకుడు

కరెంటోళ్లు కూడా బిల్లులు కడతలే!