కరోనా పేషెంట్లకు ఇంట్లోనే ఆక్సిజన్​ మెషీన్​

కరోనా పేషెంట్లకు ఇంట్లోనే ఆక్సిజన్​ మెషీన్​
  •     కాన్సంట్రేటర్​ మెషీన్లకు ఫుల్​ డిమాండ్​
  •     చుట్టూ ఉన్న గాలిని తీసుకొని ప్యూరిఫై చేసి అందిస్తున్న మెషీన్లు
  •     ఒక్కో మెషీన్​ ధర  రూ.70 వేల నుంచి 80 వేలు
  •     డిమాండ్​ను బట్టి రెంట్​కు ఇస్తున్న సప్లయర్స్

హైదరాబాద్, వెలుగు: కరోనా పేషెంట్లు ఇంట్లోనే ఆక్సిజన్​ మెషీన్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూంలోని గాలిని తీసుకొని ప్యూరిఫై చేసి అందించే ఈ మెషీన్లకు ఇప్పుడు మంచి డిమాండ్​ ఉంది. వాటర్​ ప్యూరిఫై మెషీన్లలా కనిపించే వీటిని ‘ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు’ అంటారు. ఒక్కో మెషీన్​ ధర రూ. 70వేల నుంచి 80వేల వరకు ఉంటోంది. డిమాండ్​ను బట్టి సప్లయర్స్​ వీటిని నెలకు రూ. 10వేల నుంచి 15వేల వరకు తీసుకొని రెంట్​కు ఇస్తున్నారు. 

కాన్సంట్రేటర్లకే  ఎక్కువ డిమాండ్

కరోనా సెకండ్​ వేవ్​లో వైరస్​ ప్రధానంగా లంగ్స్​పై ఎటాక్​ చేస్తోంది. లంగ్స్​ ఇన్ఫెక్ట్​ అయిన మూడు నుంచి ఐదు రోజుల్లో పేషెంట్ల కండీషన్​  సీరియస్​ అవుతోంది. ఇలాంటి పేషెంట్లకు ఆక్సిజన్​ తప్పనిసరి అవుతోంది. ఆక్సిజన్​ సిలిండర్ల కొరత ఉండటంతో పేషెంట్లు ఇంట్లోనే ఉంటూ ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను  వాడుతున్నారు. హైదరాబాద్​కు చెందిన పలువురు డీలర్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు నుంచి వివిధ రకాల బ్రాండ్ల  ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను  తెప్పిస్తున్నారు. తమకు ఇలాంటి మెషీన్స్ కావాలని రోజూ వందల్లో ఫోన్​ కాల్స్​ వస్తున్నాయని సప్లయిర్స్​ చెప్తున్నారు. హాస్పిటళ్లలో కూడా వీటిని వాడుతున్నారు. ఈ మెషీన్లు.. చుట్టూ ఉన్న గాలిని తీసుకొని ప్యూరిఫై చేసి అందిస్తుంటాయి. ఇవి కరెంట్ తో రన్ అవుతాయి.  కస్టమర్లు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సప్లయర్లు టీంతోపాటు వెళ్లి ఇంట్లో సెట్ చేసి ఎలా యూజ్ చేయాలో వివరిస్తున్నారు. అయితే...  సొంతగా ప్రయోగాలు చేయొద్దని, డాక్టర్ల సూచనల మేరకే ముందుకు వెళ్లాలని హెల్త్​ స్టాఫ్​ చెప్తున్నారు.

మెషీన్ల స్టాక్​ లేదు

ఆక్సిజన్​ సిలిండర్ల కంటే మెషీన్లకే  ఎక్కువ డిమాండ్ ఉంది. అర్ధరాత్రిళ్లు కూడా మాకు క్లయింట్స్​ నుంచి కాల్స్ వస్తుంటాయి. డెమోలో చెప్పడంతో పాటు కాల్ లో మానిటర్ చేస్తూ ఉంటాం. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ల షార్టేజ్ ఎక్కువగా ఉంది. 100 సిలిండర్లు రెంటల్ లోనే ఉన్నాయి. ఈ మధ్యనే ఒక హాస్పిటల్ కు  25  ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లను అమ్మాను. ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు నుంచి తెప్పిస్తుంటాం. అక్కడ  కూడా ఇప్పుడు స్టాక్​ లేదు. 
- మురళికృష్ణ, ఆక్సిజన్ సిలిండర్ సప్లయిర్

సొంతంగా ట్రై చేయొద్దు 

కొంచెం సివియర్ గా ఉన్న కరోనా పేషెంట్లకు కచ్చితంగా ఆక్సిజన్​ రిక్వైర్మెంట్ ఉంటుంది. ప్రస్తుతం హాస్పిటళ్లలో కూడా సిట్యువేషన్  దారుణంగా ఉంది. అందుకే హోమ్ ఐసోలేట్ అయితే ఇంట్లో ఆక్సిజన్ సెటప్ చేసుకోవాలని సూచిస్తున్నం. మేం హోమ్ ప్యాకేజీలు అందిస్తున్నాం. మా స్టాఫ్ వెళ్లి పేషెంట్​ను  చూసుకుంటారు. అయితే చాలామంది సొంతంగా ఆక్సిజన్  ట్రై చేస్తున్నారు. వారికి సివియారిటీ తెలియడం లేదు. సొంతగా ట్రై చేయొద్దు. డాక్టర్ల సూచనల ప్రకారమే ముందుకు వెళ్లాలి. పేషెంట్ కండిషన్ ఏ మాత్రం సివియర్ గా ఉన్నా హాస్పిటల్​లో అడ్మిట్​ కావాలి.
- డాక్టర్​ రఫీ, పల్మనాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్​