
హాలియా, వెలుగు: శ్రీశైలం నుంచి సాగర్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. 2,81లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంగా దిగువకు విడుదల చేస్తున్నారు. డ్యామ్అధికారులు18 గేట్లను 5 అడుగులు, 6 గేట్లను10 అడుగులు ఎత్తి 2.27 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి పంపిస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 587.30 అడుగులు( 305. 6838టీఎంసీల) నీటి మట్టానికి చేరుకుంది. ఎడమ కాల్వకు 8,896, కుడి కాల్వకు 9,500, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు ఏఎమ్మార్పి కి 2,400, వరద కాల్వకు 300, విద్యుత్ఉత్పత్తికి 33, 089 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.