
- అమెరికా H1B వీసా నిబంధనల్లో మరోసారి మార్పులు
- H1B వీసా లాటరీ సిస్టమ్‌ను తొలగింపు
- H1B వీసా దరఖాస్తు ఛార్జీలను లక్ష డాలర్లకు పెంపు
- భారత్, చైనా నుంచి అమెరికాకు వెళ్లే టెకీలపై తీవ్ర ప్రభావం
అమెరికా వెళ్లానుకునేవారికి బిగ్షాక్..ఉద్యోగాలకోసం అమెరికాకు వలస వెళ్లేవారికి H1B వీసాలు మరింత భారం కానున్నాయి. H1B వీసా దరఖాస్తు ఛార్జీలను లక్ష డాలర్లకు పెంచింది. ఇది భారత్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. టెక్ సంస్థలపై మరింత భారం పడనుంది.
అమెరికా H1B వీసా నిబంధనల్లో మరోసారి మార్పులు చేసింది ట్రంప్‌సర్కార్.H1B వీసా లాటరీ సిస్టమ్‌ను తొలగించింది.శుక్రవారం (సెప్టెంబర్19) H-1B వర్కర్ వీసాల కోసం కంపెనీలను సంవత్సరానికి లక్ష డాలర్లు చెల్లించాలని తెలిపింది. దీంతో భారత్, చైనా నుంచి అమెరికాకు వెళ్లే టెకీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇది టెక్ రంగానికి పెద్ద దెబ్బ.
జనవరిలో అధికారం చేపట్టినప్పటి నుంచిట్రంప్ వలసల అణిచివేతను ప్రారంభించారు. వలసలను పరిమితం చేసే అనేక చట్టాలు తెచ్చారు. ఇందులో H-1B వీసా జారీ, అధిక ఫీజులు ఉన్నాయి. అమెరికాకు వచ్చేవారికి తాత్కాలిక వీసాలు మాత్రమే ఇవ్వాలని ట్రంప్ సర్కార్నిర్ణయించింది.