అమెజాన్ సేల్లో ఫోన్లపై ఆఫర్లు.. iPhone ఎంత తక్కువకు ఇస్తున్నారంటే..

అమెజాన్ సేల్లో ఫోన్లపై ఆఫర్లు.. iPhone ఎంత తక్కువకు ఇస్తున్నారంటే..

హైదరాబాద్​, వెలుగు: ఈ నెల 23 నుంచి మొదలవనున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్​ సందర్భంగా ఫోన్లపై ఇస్తున్న ఆఫర్ల వివరాలను కంపెనీ ప్రకటించింది. ప్రైమ్ సభ్యులకు 24 గంటల ముందుగా, అంటే సెప్టెంబర్ 22న ఈ సేల్ అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌‌‌‌‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులపై ఏడాదిలో కెల్లా అత్యల్ప ధరలు ఉంటాయని కంపెనీ తెలిపింది.  

ఐఫోన్ 15 రూ.45,249లకే అందుబాటులోకి రానుంది.  శామ్​సంగ్ గెలాక్సీ ఎస్​24 అల్ట్రా 5జీ ధర రూ.71,999 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది.  వన్​ప్లస్ 13ఆర్ రూ.2,000 బ్యాంక్ డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌తో రూ.35,999 నుంచి లభిస్తుంది. ఐక్యూ నియో 10ఆర్ 5జీ రూ.3,000 కూపన్ డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌తో రూ.23,999 నుంచి అమ్మకానికి వస్తుంది. 

ఈ బడ్జెట్ 5జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ రెడ్‌‌‌‌‌‌‌‌మీ ఏ4 రూ.7,499 నుంచి అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు, ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్, 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, రూ.55,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయని అమెజాన్​ తెలిపింది.