ఏపీలో 8,11,825 కి చేరిన పాజిటివ్‌ కేసులు

ఏపీలో 8,11,825 కి చేరిన పాజిటివ్‌ కేసులు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2901 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8,11,825 కి చేరుకొన్నాయి. వైరస్‌ బారినపడిన వారిలో 4,352 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా చికిత్స పొందుతూ 19 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 6,625కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76,96,653 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

గత 24 గంటల్లో అనంతపురంలో 153,చిత్తూరులో 272 తూర్పుగోదావరిలో 464, గుంటూరులో 385, కడపలో 127 కృష్ణాలో 411, కర్నూల్ లో 055 నెల్లూరులో 075,ప్రకాశంలో 153, శ్రీకాకుళంలో 073, విశాఖపట్టణంలో 106, విజయనగరంలో 071,పశ్చిమగోదావరిలో 555కేసులు నమోదయ్యాయి.