
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకే షాపులు
హైదరాబాద్ బేగంబజార్ ఎంత ఫేమసో చెప్పక్కర్లేదు. ఇక్కడ ప్రతిరోజూ లక్షల రూపాయల వ్యాపారం జరగుతుంది. సిటీ నలుమూలల నుంచి ఇక్కడకు ప్రతిరోజూ వేలమంది షాపింగ్ కోసం వస్తుంటారు. అటువంటి బేగంబజార్‌లో కరోనా కలకలం రేగింది. అక్కడ షాపుల నిర్వహిస్తున్న 100 మంది వ్యాపారులకు కరోనా సోకింది. దాంతో స్వచ్ఛందంగా షాపులు మూసివేయాలని దుకాణ యజమానులు నిర్ణయించారు. గురువారం నుంచి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే షాపులు తెరచి ఉంచాలని నిర్ణయించారు. కరోనా కంట్రోల్‌లోకి వచ్చేంతవరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని బేగంబజార్ అసోసియేషన్ తెలిపింది.