
మ్యారేజ్ యానివర్సరీలో పాల్గొన్న 103 మందికి కరోనా సోకిన ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగుళూరులోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో 103 మంది కరోనావైరస్ బారినపడ్డారు. దాంతో బెంగుళూరును కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. దక్షిణ బెంగళూరులోని బిలేఖాలి ప్రాంతంలోని ఎస్ఎన్ఎన్ రాజ్ లేక్ వ్యూ అపార్టుమెంటులో ఫిబ్రవరి 6 మరియు 7 తేదీలలో రెండు వివాహ వార్షికోత్సవ పార్టీలు జరిగాయి. అపార్ట్‌మెంట్‌కి చాలామంది ఈ పార్టీలలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 11న అపార్ట్‌మెంట్‌లో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 12న మరో 17 కేసులు నమోదయ్యాయి. దాంతో అప్రత్తమైన బృహత్ బెంగుళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) అపార్ట్‌మెంట్‌లో మాస్ టెస్టింగ్ డ్రైవ్ నిర్వహించింది. అక్కడ నివసించే 1190 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారిలో 103 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో చాలామంది 50 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. అందువల్ల వీరిలో కరోనా లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా అపార్ట్‌మెంట్‌ను పూర్తిగా శానిటైజ్ చేశామని బీబీఎంపీ జాయింట్ కమిషనర్ బోమనహల్లి రామకృష్ణ తెలిపారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని నోటీసులిచ్చినట్లు ఆయన తెలిపారు.
For More News..