
హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకూ భారీగా నమోదవుతున్నాయి. వైరస్ అన్ని వర్గాల వారినీ భయాందోళకు గురి చేస్తోంది. లేటెస్టుగా కరోనా సెగ ప్రగతిభవన్ కు తాకింది. వారం రోజుల్లో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న 20 మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరంతా ఔట్ సోర్సింగ్. సెక్యూరిటీ సిబ్బంది అని చెబుతున్నారు. దీంతో ప్రగతి భవన్‌ను వైద్యాధికారుల పర్యవేక్షణలో సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో సీఎం కేసిఆర్ ఫామ్ హౌజ్ నుంచే తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు పెరగడంతో లాక్ డౌన్ పై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అయితే లాక్ డౌన్ శాశ్వత పరిష్కారం కాదని భావించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు సమాచారం.