న్యూఢిల్లీ: ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగవంతంగా, సులభంగా, పూర్తిగా ఆన్‌లైన్‌లో చేయగలిగేలా కొత్త మార్గదర్శకాలను శనివారం నుంచి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అమలు చేస్తోంది. ఇకపై ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా పేరు, చిరునామా, మొబైల్ నంబర్, పుట్టిన తేది వంటి వివరాలను ఆన్‌లైన్‌లోనే మార్చుకోవచ్చు.
కానీ, మీ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. అయితే, బయోమెట్రిక్ అప్‌డేట్స్ (ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫోటో) కోసం మాత్రం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సిందే. యూఐడీఏఐ పోర్టల్‌లో అన్ని అప్‌డేట్ రకాలూ, అవసరమైన డాక్యుమెంట్లు, ఫీజులు వివరంగా ఉన్నాయి. కొన్ని సేవలకు రూ.75–రూ.125 వరకు ఫీజులు ఉండగా, 0–5 ఏళ్ల పిల్లల ఆధార్, 5–7, 15–17 ఏళ్ల బయోమెట్రిక్ అప్‌డేట్స్ ఉచితంగా ఉంటాయి.
