- నవీన్ యాదవ్‌పై రౌడీషీట్ఎక్కడుందో చూపించాలి
- ఏఐసీసీ కోఆర్డినేటర్ రవిశేఖర్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: కేటీఆర్మతిభ్రమించి మాట్లాడుతున్నాడని ఏఐసీసీ కోఆర్డినేటర్డాక్టర్రవిశేఖర్రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఎర్రగడ్డ లక్ష్మీ కాంప్లెక్స్‌వద్ద ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి మాట్లాడారు. జూబ్లీహిల్స్కాంగ్రెస్అభ్యర్థి నవీన్‌యాదవ్ ఆర్కిటెక్చర్చదివాడన్నారు. ఆయనపై రౌడీషీట్ ఎక్కడుందో చూపించాలని సవాల్‌చేశారు.
కనీస విద్యార్హత లేని వ్యక్తిని నిలబెట్టి, సానుభూతి ఓట్లతో గెలవాలనుకుంటున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ప్రజలు వివేకవంతులని, బీఆర్ఎస్నాయకుల జిమ్మిక్కులను వారు నమ్మరని పేర్కొన్నారు. కేటీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఇలాగే మాట్లాడితే రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
