కనకదుర్గమ్మ ఆలయంలో అర్చకుడికి కరోనా పాజిటివ్

కనకదుర్గమ్మ ఆలయంలో అర్చకుడికి కరోనా పాజిటివ్

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా ఏపీలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కరోనా కలకలం రేపుతోంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఓ అర్చకుడికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వెంటనే ఆలయంలో శానిటైజేషన్ కార్యక్రమాలు పూర్తి చేశారు. లక్ష కుంకుమార్చనలో బాధిత అర్చకుడు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అర్చకుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. పాజిటివ్ వచ్చిన అర్చకుడిని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భక్తుల దర్శనాలకు ఆటంకం ఏర్పడింది. ఇప్పటికే నగరంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో ఉద్యోగులను మరింత భయాందోళనకు గురవుతున్నారు.