
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కరోనా చాప కింద నీరులాగా విస్తరిస్తోంది. షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 59కి చేరింది. కరోనా బారిన పడి ఇప్పటికే ఐదుగురు మృతి చెందగా, వైరస్ బారిన పడి చికిత్స పొంది 29 మంది కోలుకున్నారు. అయితే తాజాగా నలుగురు మహిళలకు రావడం కలకలం రేపుతుంది. కరోనా వైరస్ లక్షణాలున్న మొత్తం 185మందిని గుర్తించి, డాక్టర్లు పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ సోమవారం వచ్చే అవకాశాలు ఉన్నాయి.