
యాదాద్రి భువనగిరి: ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే శనివారం ఆమె భర్త , నల్గొండ డీసీసీబీ ఛైర్మైన్ గొంగిడి మహేందర్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు అధికారులు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చేసిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు తెలిపారన్నారు. వీరితోపాటు వీళ్ల డ్రైవర్లిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో గొంగిడీ సునీత మహేందర్ రెడ్డి ట్రీట్ మెంట్ తీసుకుంటుండగా.. ఇద్దరు డ్రైవర్లకు బేగంపేటలోని నేచర్ క్యూర్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.