
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే లేటెస్టుగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా వచ్చింది. వైరస్ సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఫ్లూ లాంటి లక్షణాలతో పాటు జ్వరం కూడా ఉన్నట్లు మారిసన్ తెలిపారు. హెల్త్ గైడ్‌లైన్స్ ఫాలో అవుతున్నానని, సిడ్నీలోని తన ఇంట్లో ఐసోలేట్ అయినట్లు ఆయన చెప్పారు. ఐసోలేషన్‌లో ఉంటూనే తన విధులను నిర్వర్తిస్తానని అన్నారు స్కాట్ మారిసన్ .
మరిన్ని వార్తల కోసం..