ఇండియన్స్‌.. వెంటనే ఖర్కివ్ సిటీ నుంచి బయటపడండి

ఇండియన్స్‌.. వెంటనే ఖర్కివ్ సిటీ నుంచి బయటపడండి

ఉక్రెయిన్‌పై దండయాత్ర సాగిస్తున్న రష్యా రెండ్రోజులుగా దూకుడు మరింత పెంచింది. ఉక్రెయిన్‌లో ఒక్కో సిటీని హస్తగతం చేసుకునే పనిలో పడిన రష్యన్ బలగాలు.. కీవ్, ఖర్కివ్ సిటీలపై టార్గెట్‌గా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే మన దేశానికి చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండ్రోజుల ముందే కీవ్‌ నుంచి ఇండియన్స్‌ను ఖాళీ చేసి ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకోవాల్సిందిగా.. ఆదేశించింది. ఇవాళ తాజాగా ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. ఖర్కివ్‌లోని భారత పౌరులంతా తక్షణం ఆ సిటీ నుంచి బయటపడాల్సిందిగా సూచించింది. భారత పౌరుల సేఫ్టీ, సెక్యూరిటీ దృష్ట్యా వారిని వేగంగా ఖర్కివ్ విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొంది. ఉక్రెయిన్ టైమ్ ప్రకారం ఆరు గంటల్లోపు (ఇండియన్ టైమ్ ప్రకారం రాత్రి 9.30 గంటలు) పెసోచిన్, బబాయే, బెజ్లియుడోవ్కాల్లో ఏదో ఒక ప్రాంతానికి చేరుకోవాలని కోరింది.

ఉక్రెయిన్‌లో భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మన విద్యార్థులను సేఫ్‌గా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగ’ పేరుతో చర్యలు తీసుకుంటోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారు సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటే.. అక్కడి నుంచి పొరుగు దేశాల్లోని ఎయిర్ పోర్టుల నుంచి స్పెషల్ ఫ్లైట్స్‌లో ఇండియాకు చేరుస్తోంది. ఈ క్రమంలో యుద్ధ బీభత్సం మధ్య భారతీయులకు ఎటువంటి హాని చేయకుండా ఉండేలా ప్రధాని మోడీ.. ఉక్రెయిన్, రష్యా దేశాల అధ్యక్షులతో చర్చలు జరిపారు. ఈ మేరకు  భారత విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులకు భారత దేశ జెండాను పెట్టుకొని వెళ్తే హాని చేయబోమని రెండు వైపుల నుంచి హామీ ఇచ్చింది. దీంతో మన విద్యార్థులు ఉక్రెయిన్‌లోని సిటీల నుంచి జాతీయ జెండాలతో సరిహద్దు వరకూ చేరుకోవాల్సిందిగా భారత ప్రభుత్వం సూచించింది.

మరిన్ని వార్తల కోసం..

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్

‘రాధే శ్యామ్’ రెండో ట్రైలర్‌లో మ్యాజిక్ చేసిన ప్రభాస్

నేనిక్కడే ఉంటా.. మీ ఫ్రెండ్స్‌ను సేఫ్‌గా తీసుకొస్తా