విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్‌

విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్‌

ముంబైలోని తలోజా జైల్లో ఉన్న విరసం నేత వరవరరావుకు కరోనా వైరస్‌ సోకింది. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. భీమా కోరేగావ్‌ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్‌ఐఏ అరెస్ట్‌ చేసి తలోజా జైలుకు తరలించింది. 22 నెలలుగా జైల్లో ఉన్న వరవరరావును మే నెలలో జేజే  ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ…చికిత్స పూర్తి కాకముందే  మళ్లీ జైలు కు పంపించారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది.

ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  దీంతో  ఆయన కుటుంబ సభ్యులు ,పౌరహక్కుల నేతలు వెంటనే ఆయనకు చికిత్స అందించాలని డిమాండ్ చేయడంతో  జైలు అధికారులు సోమవారం రాత్రి ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వరవరరావును బెయిల్‌పై విడుదల చేయాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులతో పాటు ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.